Daughters with mother’s dead body: దహన సంస్కారాలకు డబ్బుల్లేక తల్లి డెడ్ బాడీతో 7 రోజులు కూతుళ్ల సహజీవనం
Daughters with mother's dead body: తెలంగాణలో గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. తల్లి చనిపోయిందని తెలిసినా ఆ డెడ్ బాడీని ఇంట్లోని ఉంచుకున్నారు ఆమె ఇద్దరు కూతుళ్లు. ఈ సంఘటన శుక్రవారం, డిసెంబర్ 31న వెలుగులోకి వచ్చింది. మృతురాలు శ్రీ లత (45) అనే మహిళ జనవరి 23న నిద్రలోనే కన్నుమూసింది. ఈ విషయం తెలిసినప్పటికీ తమ కూతుళ్లు 7 రోజుల పాటు ఇంట్లోనే తల్లి మృతదేహాన్ని ఉంచుకున్నారు.
Daughters with mother’s dead body: తెలంగాణలో గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. తల్లి చనిపోయిందని తెలిసినా ఆ డెడ్ బాడీని ఇంట్లోని ఉంచుకున్నారు ఆమె ఇద్దరు కూతుళ్లు. ఈ సంఘటన శుక్రవారం, జనవరి 31న వెలుగులోకి వచ్చింది. మృతురాలు శ్రీ లత (45) అనే మహిళ జనవరి 23న నిద్రలోనే కన్నుమూసింది. ఈ విషయం తెలిసినప్పటికీ తమ కూతుళ్లు 7 రోజుల పాటు ఇంట్లోనే తల్లి మృతదేహాన్ని ఉంచుకున్నారు.
హైదరాబాద్ జంట నగరమైన సికింద్రాబాద్‌లోని తమ ఇంట్లో ఇద్దరు యువతులు తమ తల్లి శవంతో దాదాపు ఏడు రోజులు గడిపిన సంఘటన సంచలనం సృష్టించింది. వారాసిగూడలో ఓ అద్దె ఇంట్లో ఈ కుటుంబం జీవిస్తోంది. అయితే ఈ ఇంట్లో ఉండే శ్రీలత అనే మహిళ జనవరి 23న నిద్రలోనే చనిపోయింది. ఈ విషయాన్ని ఆమె కుమార్తెలు రవళిక (25), అశ్విత (22) ఎవరికీ చెప్పలేదు. అలా అని బయటికీ వెళ్లిపోలేదు. శవంతో ఇంట్లోనే ఉన్నారు.
అలా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు దాదాపు 7 రోజులు తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం పోలీసులు ఇంట్లోకి ప్రవేశించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఓ గదిలో తల్లి మృతదేహం, మరో గదిలో ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. యువతులు తమ మణికట్టు కోసుకుని జీవితాలను ముగించుకునేందుకు కూడా ప్రయత్నించినట్టు సమాచారం. పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
2 నెలల క్రితమే ఇంటిని అద్దెకు తీసుకున్నారని ఆ ఇంటి యజమాని తెలిపారు. వారు ఇంట్లో రెండు కుక్కలను పెట్టుకోవడంతో ఇల్లు ఖాళీ చేయాలని చెప్పామన్నారు. ఇకపోతే దహన సంస్కారాలకు డబ్బు లేకపోవడం వల్లనే యువతులు తమ తల్లి డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచుకున్నారని కొందరు స్థానికులు తెలిపారు.
అయితే నిజంగానే ఆ కారణం వల్లనే వారు ఈ పని చేశారా లేదా ఇంకేదైనా కారణమా అన్న విషయాలు మాత్రం వాంగ్మూలాలు తీసుకున్న తర్వాతే తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు పోలీసులు మానసికంగా కుంగిపోయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లలను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక కుళ్లిపోయిన మహిళ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ALSO READ: CM Revanth Reddy: బీజేపీ ఆఫీస్ ఉన్న గల్లీకి గద్దర్ పేరు పెడ్తా: సీఎం రేవంత్ రెడ్డి
Daughters with mother’s dead body: దహన సంస్కారాలకు డబ్బుల్లేక తల్లి డెడ్ బాడీతో 7 రోజులు కూతుళ్ల సహజీవనం