Numerology: ప్రతీ తల్లిదండ్రి కోరుకునేది తమ పిల్లలు వినయంగా, చదువులో బాగా రాణించి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడమే. అందుకోసం కష్టపడి మంచి స్కూల్‌కి పంపడం, అవసరమైన సౌకర్యాలు అందించడం చేస్తారు. కానీ పిల్లల ఫలితాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. కొంత మంది పిల్లలు ఎక్కువగా చదువుతారు, మరికొందరు యావరేజ్‌లోనే ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం, పిల్లల పుట్టిన తేదీ, రాశి, స్వభావం తదితరాలు వారి విద్యా సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతుంది.
జన్మ తేదీ ఆధారంగా కొన్ని పిల్లలు ఇతరుల కంటే చదువులో ఎక్కువ శ్రద్ధ చూపుతారని నమ్మకం ఉంది. ఉదాహరణకు, నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన పిల్లల జన్మ సంఖ్య 1 అవుతుంది. వీరు నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు, కష్టపడి లక్ష్యాలను చేరతారు.
నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన పిల్లల జన్మ సంఖ్య 3. వీరు తెలివిగా, సృజనాత్మకంగా ఆలోచిస్తారు, జ్ఞాపకశక్తి ఎక్కువ. కళలు, రచనలు, క్రియేటివ్ ఫీల్డ్‌లలో సులభంగా విజయం సాధిస్తారు.
నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టిన పిల్లల జన్మ సంఖ్య 5. వీరు చురుకైన, తార్కిక ఆలోచన కలిగినవారు. సమస్యలను పరిష్కరించే నైపుణ్యం కలిగి ఉంటారు. సైన్స్, టెక్నాలజీ, పరిశోధన రంగాల్లో బాగా రాణిస్తారు.
నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టిన పిల్లల జన్మ సంఖ్య 7. వీరు పరిశోధనాత్మకంగా ఆలోచిస్తారు, విషయాలను లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు, కష్టమైన విషయాలను సులభంగా అర్థం చేసుకుంటారు.
చదువులో విజయానికి తల్లిదండ్రులు కొన్ని అలవాట్లను పిల్లలకు పాటించించాలి. ఉదయం నిద్రలేచి చదవడం, సరస్వతీ దేవి పూజ, సరస్వతీ మంత్రం జపించడం జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంచుతాయి. బుధవారం పచ్చ రంగు దుస్తులు ధరించడం, ఆకుపచ్చ వస్తువులను ఉపయోగించడం శుభప్రదం. ప్రతిరోజూ కొంచెం ధ్యానం లేదా యోగా చేయడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఇవి సూచనలు మాత్రమే. నిజంగా విజయాన్ని పొందాలంటే కష్టపడి చదవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, తల్లిదండ్రుల మార్గనిర్దేశం అత్యంత అవసరం.


