Dasara Draw With Goat, Booze, Sari Goes Viral in Khammam

Viral: ఈ దసరా మామూలుగా ఉండదు.. రూ.200కే మేక, మందు, మిక్సీ, బీర్లు!

Viral: తెలంగాణలో దసరా పండగ ఎంత ఘనంగా జరుగుతుందో చెప్పాల్సిన అవసరమే లేదు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలతో ప్రతి ఊరు పండుగ వాతావరణంలో తేలిపోతుంది. ఈ వేళలో ఎక్కడ చూసినా ఉత్సాహం, సందడి నెలకొని ఉంటుంది. అలాంటి ప్రత్యేక సందర్భంలో ఖమ్మం జిల్లాలో ఓ వినూత్న లక్కీ డ్రా నిర్వహణ చర్చనీయాంశమైంది. కేవలం రూ.200తో కూపన్‌ కొనుగోలు చేసి, మేక, మిక్సీ, పట్టుచీర, ఫుల్‌ బాటిల్స్‌, కాటన్‌ బీర్ల వంటి బహుమతులను గెలుచుకునే అవకాశం […]

Viral: మూత్రనాళంలో ఇరుక్కున్న 9 సెంటీమీటర్ల పెన్సిల్

Viral: ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్ సెంట్రల్ జైలులో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగుచూసింది. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ మూత్రనాళంలో మంట, దురదతో బాధపడుతున్నానని అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే జైలు అధికారులు అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు అతని మూత్రనాళంలో 9 సెంటీమీటర్ల పొడవైన పెన్సిల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. మూత్ర విసర్జనలో తీవ్ర ఆటంకం, రక్తస్రావం కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఐదుగురు వైద్యుల బృందం […]

Gemini Nano Banana creates 5 million AI images, Google CEO Sundar Pichai said…

Nano Banana: నానో బనానా క్రేజ్.. నెలలో 500 కోట్ల ఏఐ ఫొటోలు క్రియేట్ చేసింది

Nano Banana: జీబ్లీ స్టైల్ ట్రెండ్ తరువాత ఇప్పుడు టెక్ ప్రియులు నానో బనానా 3డీ డిజిటల్ బొమ్మలు (Gemini Nano Banana) సృష్టించుకోవటంలో మునిగిపోయారు. ఈ కొత్త ఏఐ ఫీచర్ విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఫలితంగా ఒక్క నెలలోనే 500 కోట్ల ఇమేజ్లు సృష్టించబడ్డాయి. ఈ విషయం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా ఎక్స్‌లో వెల్లడించారు. గూగుల్ ఇటీవల పరిచయం చేసిన జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ టూల్ (దీనినే నానో బనానా అని […]

Viral Video: For likes and views, children performed stunts on high-tension wires

Viral Video: లైక్స్, వ్యూస్ కోసమేనా ఇదంతా.. ఏకంగా కరెంట్ వైర్లతోనే ఆటలా..??

Viral Video: ఈ రోజుల్లో సోషల్ మీడియా కోసం కొందరు ఏ స్థాయికైనా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. లైక్‌లు, వ్యూస్ కోసం ప్రాణాలకే ముప్పు తెచ్చే పనులు చేస్తున్నారు. కేవలం వీడియో వైరల్ కావాలని, కొంతకాలం చర్చలో నిలవాలని, తమను గుర్తించాలనే వ్యామోహం కోసం ఊహించలేని స్టంట్లు చేస్తున్నారు. ఈ మోజు కొన్నిసార్లు ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వీడియోలో ఒక యువకుడు లైవ్ ఎలక్ట్రికల్ వైర్లపై వేలాడుతూ […]

NEET: నీట్ లో 99.99 స్కోర్.. ఒత్తిడి భరించలేక విద్యార్థి బలవన్మరణం

NEET: మహారాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వైద్యవిద్యను అభ్యసించాలనే ఒత్తిడిని తట్టుకోలేక ఓ ప్రతిభావంతుడు విద్యార్థి తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, నవర్గావ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు ఇటీవల జరిగిన NEET UG-2025 పరీక్షలో 99.99 శాతం స్కోరు సాధించాడు. అంతేకాక జాతీయ స్థాయిలో 1475వ ర్యాంక్ దక్కించుకొని అందరి ప్రశంసలు అందుకున్నాడు. అతనికి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు కేటాయించబడింది. కుటుంబ సభ్యులు అడ్మిషన్ […]

Kerala man hacks wife to death, confesses to murder on Facebook Live

Crime: నా భార్యను చంపేశా.. కత్తితో నరికి ఫేస్ బుక్ లో ప్రకటించిన భర్త

Crime: కేరళలో ఓ భర్త తన భార్యను దారుణంగా హతమార్చిన ఘటన కలకలం రేపింది. అంతేకాకుండా, ఆ విషయాన్ని ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రకటించడం సంచలనంగా మారింది. మృతురాలు కొల్లం జిల్లాకు చెందిన శాలిని (39)గా పోలీసులు గుర్తించారు. నిందితుడు ఇసాక్ (42) హత్య అనంతరం పునాలూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం, గల్ఫ్‌ నుంచి తిరిగి వచ్చిన ఇసాక్ రబ్బర్ ట్యాప్పర్‌గా పనిచేస్తున్నాడు. శాలిని స్థానిక పాఠశాలలో సహాయకురాలిగా ఉద్యోగం చేస్తోంది. వీరికి ఇద్దరు […]

Ambala: Cobra Travels 300 Km In Truck, Alert Driver Hands It Over To Wildlife Dept

Viral: సీటు కిందే నాగుపాము పెట్టుకుని.. 300 కి.మీలు ప్రయాణించాక చూసిన డ్రైవర్

Viral: ఉత్తరప్రదేశ్‌ ఘాజియాబాద్‌ నుంచి హర్యానాలోని అంబాలాకు ట్రక్‌ నడుపుకుంటూ వెళ్తున్న ఓ డ్రైవర్‌ జీవితంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. సుమారు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత అతను తన వాహనంలోని డ్రైవర్‌ సీటుపై ఏకంగా ఏడు అడుగుల కొండచిలువ (కోబ్రా) కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. ప్రయాణంలో ఒక్కసారిగా శబ్దం వినిపించడంతో మొదట టైరు లీక్‌ అయిందని డ్రైవర్‌ భావించాడు. అయితే మధ్యలో టీ తాగడానికి ఆగి, తిరిగి ట్రక్‌లోకి వచ్చినప్పుడు సూటిగా డ్రైవర్‌ సీటుపై పెద్ద […]

Viral: ఇంత పెద్ద గరిట ఎక్కడా ఉండదు.. జేసీబీతో కూర కలిపారు

Viral: ఆలయాల్లో జరిగే అన్నదాన కార్యక్రమాల్లో వందల టన్నుల బియ్యం, కూరగాయలతో ఆహారాన్ని సిద్ధం చేస్తారు. ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో ఒకేసారి వేలాది మంది భక్తులకు ఆహారం అందించాల్సి రావడంతో, పెద్ద పెద్ద పాత్రల్లో వంటలు వండుతారు. టన్నుల కొద్దీ ఆహారాన్ని తయారు చేయాలంటే గంటల కొద్దీ సమయం పడుతుంది. అంతేకాకుండా, ఈ సందర్భాల్లో కొత్తగా ప్రత్యేక పాత్రలను కూడా తయారు చేయిస్తారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని దండరోయ ధామ్ ఆలయంలో ఇలాంటి అన్నదాన కార్యక్రమం జరిగింది. అక్కడ […]

Too hot to hire? Rejected after 50 job interviews - woman says her stunning looks were the dealbreaker

Ale Gaucha: ఇదేందయ్యా ఇది.. అందంగా ఉందని ఉద్యోగమిస్తలేరంట

Ale Gaucha: బ్రెజిల్‌కు చెందిన 21 ఏళ్ల యువతి అలే గౌచా తన జీవితంలో ఎదుర్కొన్న విచిత్రమైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా, తన అందమే తనకు అడ్డంకిగా మారిందని ఆమె వాపోయింది. అలే గౌచా చెప్పిన వివరాల ప్రకారం – తాను కేర్‌టేకర్ (నానీ) ఉద్యోగం కోసం 50కి పైగా ఇంటర్వ్యూలు ఇచ్చిందట. అయితే ప్రతి ఇంటర్వ్యూలోనూ తన అందం కారణంగానే తిరస్కరించారని ఆమె తెలిపారు. ఇంట్లో భర్తలతో […]

A Midnight Trip To Sialia, The Doorless Village Of Kendrapara In Odisha

Viral: ఈ ఊళ్లో ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు.. ఒక్క కేసూ లేదు

Viral: మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా ఇంటికి తాళం వేసి బయలుదేరుతాం. రాత్రి నిద్రపోయే ముందు కూడా తలుపులు బిగించి పడుకుంటాం. కానీ ఒడిశాలోని కేంద్రపడా జిల్లాలో సియాలియా గ్రామం మాత్రం ఈ ఆచారానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ దాదాపు 100 ఇళ్లు ఉన్నా ఒక్కింటికీ తలుపులు ఉండవు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పటివరకు ఈ గ్రామంలో ఒక్క దొంగతనం కూడా జరగలేదట. గ్రామస్థుల విశ్వాసమే దీనికి కారణం. సియాలియా గ్రామ దేవత అయిన ఖరఖై […]