Viral Video: ఏనుగు vs ఖడ్గమృగం

Viral Video: ప్రపంచవ్యాప్తంగా అనేక జీవజాతులు నివసిస్తున్నాయి. వాటిలో బలశాలి జంతువు ఏదంటే మనకు గుర్తొచ్చేది ఏనుగే. గజరాజులు కొన్ని ప్రత్యేక అటవీ ప్రాంతాలను ఎంచుకుని అక్కడే జీవిస్తాయి. అవి నివసించే ప్రాంతాలు పచ్చదనంతో నిండిపోతాయి. పర్యావరణ సమతుల్యతకు, జీవవైవిధ్యానికి ఏనుగులు కీలక పాత్ర పోషిస్తాయి. అడవిలో వీటిని పెద్దమనుషులుగా ఇతర జంతువులు గౌరవిస్తాయి. సాధారణంగా ఇవి ఎవరికీ హాని చేయవు. కానీ ఎవరైనా వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఎదురుదాడి చేస్తాయి. ఇదే విషయాన్ని […]

High Court: బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ రేపటికి వాయిదా

High Court: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో సాగిన విచారణను గురువారానికి వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 9ను జారీ చేసింది. ఈ జీవోపై బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేష్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అదే సమయంలో బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఆర్.కృష్ణయ్య, వీ హనుమంతరావు తదితర బీసీ నేతలు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు సమర్పించారు. సీజే ఏకే సింగ్ నేతృత్వంలోని […]

Drinking Alcohol: మందు తాగేముందు రెండుచుక్కలు నేలపై ఎందుకు చల్లుతారో తెలుసా?

Drinking Alcohol: మందు తాగేముందు రెండుచుక్కలు నేలపై ఎందుకు చల్లుతారో ఎప్పుడైనా ఆలోచించారా? మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసినా.. చాలామంది దానిని అలవాటుగా చేసుకున్నారు. అంతేకాక, దానికి పలు సెంటిమెంట్స్ కూడా జోడించారు. ఎవరో శనివారం మద్యం తాగరని చెబుతారు, మరొకరు స్నానం చేసిన తర్వాతే తాగుతారు. ఆరోగ్యానికి హాని కలిగించే ఈ అలవాటును సాంప్రదాయాలు, సెంటిమెంట్స్‌తో కలిపి కొందరు ఆచారంలా మార్చుకున్నారు. ముఖ్యంగా చాలామంది మందుబాబులు తాగడం ప్రారంభించే ముందు గ్లాస్‌లోని రెండుమూడు […]

75-year-old man marries 35-year-old woman in UP, dies next morning

Viral: 35 ఏళ్ల మహిళతో 75 ఏళ్ల వృద్ధుడి పెళ్లి.. కానీ అంతలోనే..!!

Viral: ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పుర్ జిల్లా కుచ్‌ముచ్ గ్రామంలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 75 ఏళ్ల వయసులో ఒంటరి జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్న వృద్ధుడు రెండో పెళ్లి చేసుకున్నా, ఆ సంతోషం ఒక్కరోజు కూడా నిలవలేదు. పెళ్లైన మరుసటి రోజు ఉదయమే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే… సంగ్రురామ్ (75) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం ఆయన మొదటి భార్య మరణించడంతో పిల్లలు లేని సంగ్రురామ్ పూర్తిగా ఒంటరిగా […]

Post on Instagram.. Brutal murder of a young man at Jagtial Dist

Crime: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్.. యువకుడి దారుణ హత్య

Crime: జగిత్యాల జిల్లాలో ఓ యువకుడి హత్య కలకలం రేపింది. సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ ఎదురగట్ల సతీష్‌ (యువకుడు) అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి కుటుంబ సభ్యులు పలుమార్లు సతీష్‌ను హెచ్చరించినప్పటికీ, అతను వెనకడుగు వేయలేదు. ఇక ఆ యువతికి మరో సంబంధం చూసుకుంటున్నారని చెప్పి, ఇకపై ఆ ప్రేమను కొనసాగించవద్దని వారు స్పష్టంగా హెచ్చరించారు. కానీ కలత చెందిన సతీష్, […]

MP: Year after airgun attack, 3 needles removed from undertrial prisoner’s heart

Viral: గుండెలో సూదులు.. ఏడాది తర్వాత ఆపరేషన్ చేసి తొలగింపు

Viral: మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన ప్రభుత్వ వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్స చేసి విజయాన్ని సాధించారు. ఏడాది క్రితం ఓ 29 ఏళ్ల యువకుడి గుండెలోకి దూసుకెళ్లిన సూదులను ఓపెన్‌హార్ట్ తరహా సర్జరీ ద్వారా తొలగించారు. ఒకటి నుంచి రెండున్నర అంగుళాల పొడవు కలిగిన ఈ పదునైన వస్తువులు గుండెలో ఇంతకాలం ఉండి కూడా అతను సాధారణ జీవితం గడపడం వైద్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే, ఇందౌర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆ […]

Discover the Indian states with highest snake population

Snake: మీకు తెలుసా.. ఇక్కడ మనుషుల కంటే పాములే ఎక్కువ

Snake: ప్రతీ ఏడాది లక్షలాది మంది పర్యాటకులు దర్శనమిస్తారు కేరళ రాష్ట్రాన్ని. ప్రకృతి సోయగాలతో నిండిన ఈ రాష్ట్రాన్ని ప్రపంచం “గాడ్స్ ఓన్ కంట్రీ” అని పిలుస్తుంది. కేరళ ప్రత్యేకతల్లో ఒకటి పాముల సంఖ్య. ఇక్కడ ఏకంగా 350 రకాల పాములు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు, అధిక వర్షపాతం, దట్టమైన అడవులు పాముల పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. ఈ కారణంగానే చెట్లు, అడవులు విస్తరించి ఉంటాయి. పాములకు అవసరమైన ఆహారం, దాక్కునేందుకు సరైన […]

Police say Vijay's late arrival led crowds to swell: What caused Karur stampede?

Viral: సూపర్బ్.. అప్పులకు దూరంగా ఉంటున్న వంద గ్రామాలు

Viral: సాదా జీవనం అనేది సంతోషకరమైన జీవితానికి మంత్రం అని పంజాబ్‌లోని సాదే రేహ్నే సొసైటీ ప్రోత్సహిస్తోంది. వివాహాలు, అంత్యక్రియల భోగాలు వంటి సామాజిక వేడుకల కోసం తీసుకునే అప్పుల వల్ల పెరుగుతున్న ఆత్మహత్యల సమస్యను ఎదుర్కోవడానికి ఈ సమాజంలో ఒక సులభమైన, ప్రభావవంతమైన సందేశాన్ని ఈ సంస్థ ప్రచారం చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని 2017లో భారత రైల్వే లో రిటైర్ అయిన ఉద్యోగి ఉర్విందర్ సింగ్ ప్రారంభించారు. గత ఎనిమిది సంవత్సరాల్లో ఆయన చేసిన కృషి […]

UP Man Vents His Anger On Friend’s Funeral Pyre Over Rs 50,000 Loan | Viral Video

Viral Video: డబ్బు మాయ.. అప్పు చెల్లించకుండా చనిపోయిన స్నేహితుడి చితిపై..

Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు, అతని చితిని కొట్టిన వ్యక్తి చిన్ననాటి నుంచే స్నేహితులు. ఇద్దరూ ఒకే గ్రామంలో పెరిగి, వ్యవసాయ పనుల్లో కూడా కలసి పనిచేసేవారు. రెండేళ్ల క్రితం మృతుడు తన స్నేహితుడి వద్ద నుంచి రూ.50,000 అప్పు తీసుకున్నాడు. అయితే ఆ డబ్బు తిరిగి చెల్లించకముందే అతను మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న స్నేహితుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. […]