VIDEO VIRAL: భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల తన ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి వివిధ కార్యక్రమాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా రాంచీ రోడ్లపై ధోనీ తన ప్రఖ్యాత ‘బీస్ట్’ కారులో డ్రైవ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రత్యేకత ఏమిటంటే.. ఈ కారుకు భారత ఆర్మీ థీమ్‌లో ప్రత్యేక మోడిఫికేషన్స్ చేయించటం.
కారు ఫైటర్ జెట్లు, ట్యాంకర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, భారత సైన్యాన్ని ప్రదర్శించే ఆర్ట్‌వర్క్ అద్భుతంగా ఉంటుంది. అభిమానులు ఈ ప్రత్యేక డిజైన్ చూసి అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
కార్ ప్రైసింగ్ వెబ్సైట్ ప్రకారం.. ఈ కారు దాదాపు రూ.75 లక్షల విలువ కలిగి ఉంటుంది. మోడిఫికేషన్ చేసిన తర్వాత అదనంగా రూ.5 లక్షల ఖర్చు వచ్చే అవకాశం ఉంది. రాంచీలోని ఒక ప్రీమియం కార్ డిటైలింగ్ స్టూడియో 2024లో ఈ మోడిఫికేషన్ పూర్తి చేసినట్లు వార్తలు ఉన్నాయి. స్టూడియో ఫౌండర్ అచ్యుత్ కిశోర్ తెలిపారు.
వీడియో వైరల్ కావడంతో ధోనీ అభిమానుల మధ్య మళ్లీ ఆసక్తి పెరిగింది. అతడి స్టైల్, దేశభక్తి భావన కలిగిన ఈ ప్రత్యేక ‘బీస్ట్’ కారు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: Cyber fraud: పెళ్లి పత్రికల పేరుతో వాట్సాప్‌లో కొత్త తరహా సైబర్ మోసాలు
VIDEO VIRAL: ఆర్మీ థీమ్‌తో కారు డిజైన్.. ధోనీ చక్కర్లు


