కిరాతకం.. డబ్బుల కోసం చెల్లిని చంపిన అన్న
ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సొంత చెల్లెలని కూడా చూడకుండా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ అన్న అతి కిరాతకానికి ఒడిగట్టాడు. కోటి రూపాయల కోసం తన చెల్లిని చంపేశాడు. ప్రస్తుతం ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతుంది.

అన్నా చెల్లెల అనుబంధం ఎంతో గొప్పది. విడదీయలేని ఈ రక్త సంబంధంలో ప్రతీ చెల్లి తన అన్నను ఎంతో గొప్పగా ఊహించుకుంటుంది. ప్రతీ కష్టంలో తనకు తోడు ఉంటాడని నమ్ముతుంది. రక్షాబంధన్ రోజున రాఖీ కట్టి తన అన్నకి తాను తోడుగా ఉన్నానని గుర్తు చేస్తుంది. ఇలాంటి గొప్ప బంధాన్ని ఓ అన్న చంపేశాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లిని హత్య చేశాడు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రకాశం జిల్లా పొదిలి మండలం తాటివారిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెల్లెలి పేరు మీద ఉన్న కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు కోసం అన్న ఆమెను చంపేశాడు. అంతేకాకుండా యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల వారంతా షాక్ కు గురయ్యారు. డబ్బులు కోసం ఇంత దారుణానికి దిగజారిపోతాడని ఊహించలేదని వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. అయితే ఈ సంఘటన 2025 ఫిబ్రవరిలో జరిగినట్టు తెలుస్తుంది.