కోనారెడ్డి చెరువు ఆక్రమణపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధం: గోధుమల మధుసూదన్
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: కోనారెడ్డి చెరువు ఆక్రమణపై చర్చకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమా అని బిఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట మండల అధ్యక్షులు తూల్ల కుమారస్వామి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్ సవాల్ విసిరారు.
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: కోనారెడ్డి చెరువు ఆక్రమణపై చర్చకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమా అని బిఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట మండల అధ్యక్షులు తూల్ల కుమారస్వామి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్ సవాల్ విసిరారు. శనివారం వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు అక్రమణకు గురైందని చెప్పి ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందని, దానిలో భాగంగానే ఆర్టిఐ ద్వారా మండల తహసీల్దార్ కార్యాలయం నుండి తీసుకున్న సమాచారం మేరకు వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు మత్తడి 234 మీటర్లు ఉండగా ప్రస్తుతం అది 50 మీటర్లకే పరిమితమైందని, మిగతా భూమి అక్రమణకు గురైంది అని తెలిపారు.
అదేవిధంగా కోణారెడ్డి చెరువు నుండి దమ్మన్నపేటకు వెళ్లాల్సిన దారి కూడా ఆక్రమణకు గురికావడం జరిగిందన్నారు. సుమారు 487 ఎకరాలు విస్తీర్ణం గల కోనారెడ్డి చెరువు చుట్టుప్రక్కల అక్రమణకు గురైందని చెప్పడం జరిగిందన్నారు. అదే మాటకు తాము కట్టుబడి ఉన్నామని, దీనిపైన తమ దగ్గర ఉన్న ఆర్టిఐ ప్రతులు మీడియాకు ఇస్తామని, కాంగ్రెస్ నాయకులు కోరినట్లయితే వారికి కూడా ఎప్పుడంటే అప్పుడు ఇస్తామని, సవాల్‌కు కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉండాలని అన్నారు.
ఈ సమావేశంలో ఆత్మ మాజీ చైర్మన్ గుజ్జ గోపాల్ రావు, దేవస్థానం మాజీ చైర్మన్ సిలివేరు కుమారస్వామి యాదవ్, తుమ్మల యాకయ్య, మార్త సారంగపాణి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండీ ఆజిమ్, యూత్ అధ్యక్షులు తిరుపతి సురేష్, మాజీ ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీనివాస్, పిట్టల రాజు, కందుగుల నరసయ్య, కొండేటి సంపత్, సింగరబోయిన రాజశేఖర్, తుమ్మల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: dowry: రూ.50లక్షల నగదు, అరకిలో బంగారం, బెంజ్ కారు ఇవ్వలేదని రాత్రికి రాత్రే వరుడు పరార్
కోనారెడ్డి చెరువు ఆక్రమణపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధం: గోధుమల మధుసూదన్