Illicit relationship with father: తండ్రితో అక్రమ సంబంధం.. అనుమానంతో బాలుడు హత్య
Illicit relationship with father: సోషల్ మీడియా ప్రభావమో.. ఈ జనరేషన్ ప్రభావమో తెలియదు కానీ చిన్నపిల్లలు సైతం ప్రవర్తించే తీరుకి సమాజం నివ్వెర పోతుంది. చిన్న వయసులోనే ప్రతి విషయం పసిగట్టటం మంచి విషయమేనప్పటికీ పరిధి దాటి ఆలోచించడం సరైన విషయం కాదని తెలుస్తోంది. తాజాగా కోల్‌కతాలో జరిగిన ఒక సంఘటన గురించి తెలిస్తే ఎలాంటి వారైనా ఆశ్చర్య పోవాల్సిందే.

కోల్‌కతాలో ఒక బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. తన తండ్రితో ఒక మహిళకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన ఆ బాలుడు ఆమెని హతమార్చాడు. ఈ సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది.
తల్లి మరో వ్యక్తితో కలిసి టీ స్టాల్ వద్దకు వచ్చిన ఆ బాలుడు తండ్రితో కలిసి టీ తాగుతున్న మహిళలను కత్తితో పొడిచి చంపాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ బాలుడికి 16 ఏళ్లు ఉంటాయని తెలుస్తోంది. తన తండ్రి అంటే తనకు ఎంతో ఇష్టమని కానీ వేరొకరి వలలో పడి తమను పట్టించుకోవడంలేదని అందుకే ఇలా ప్రవర్తించానని చెప్పినట్టు స్థానికులు సమాచారం ఇస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థానానికి చేరుకొని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి తల్లితో పాటు వెంట వచ్చిన మరో వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. ఈ ఘటనతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ALSO READ: Online games: ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై మానసిక రోగుల్లా మారుతోన్న యువత
Illicit relationship with father: తండ్రితో అక్రమ సంబంధం.. అనుమానంతో బాలుడు హత్య