Food Spots : హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బెస్ట్ ఫుడ్ స్పాట్స్ ఇవే
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ప్రతి వీధికి ఒక కథ ఉంటుందనడంలో ఎలాంటి అబద్దం లేదు. కొన్ని కథలు రాతితో చేసిన కట్టడాలను గురించి చెబితే, మరికొన్ని వినేందుకు ఆహ్లాదంగా అనిపిస్తాయి. అలాగే ఈ ప్రాంతంలో బెస్ట్ ఫుడ్ దొరికే ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి.
Food Spots : హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ప్రతి వీధికి ఒక కథ ఉంటుందనడంలో ఎలాంటి అబద్దం లేదు. కొన్ని కథలు రాతితో చేసిన కట్టడాలను గురించి చెబితే, మరికొన్ని వినేందుకు ఆహ్లాదంగా అనిపిస్తాయి. అలాగే ఈ ప్రాంతంలో బెస్ట్ ఫుడ్ దొరికే ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవి పర్యాటకులను స్థానికులను మరింత ఆకర్షిస్తాయి. మళ్లీ మళ్లీ తినాలనే కోరికను కలిగిస్తాయి. అవేంటంటే..
చార్మినార్ వ్యూను చూస్తూ తాగే చాయ్
మీరు నిజమైన హైదరాబాదీ కావాలనుకుంటే, మీ ఉదయం ఇరానీ చాయ్‌తో ప్రారంభించాలి. ఓల్డ్ సిటీలో బెస్ట్ చాయ్ స్పాట్ ఏదని అడిగితే చాలా మంది చెప్పే పేరు నిమ్రా కేఫ్, బేకరీ. ఇక్కడ చాయ్ కప్పు చార్మినార్ అందమైన సిల్హౌట్‌తో వస్తుంది. మీ చుట్టూ పావురాలు ఎగురుతున్నట్లు చూడటం, మీ చాయ్‌లో వెచ్చని ఉస్మానియా బిస్కెట్‌ను ముంచడం ఒక వైబ్.
View this post on Instagram
బెస్ట్ బ్రేక్ ఫాస్ట్
ఓల్డ్ సిటీలో బ్రేక్ ఫాస్ట్ అనేది క్యాజువల్ మీల్ కాదు. నిహారీ, పాయా, కిచ్డి, ఖట్టా, ఖీమా, భేజా, గుర్డే, కాలేజీ లాంటివి హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఏ హోటల్ లోనైనా ఉంటాయి. కానీ అత్యంత పేరొందిన బ్రేక్ ఫాస్ట్ ప్రదేశం ఏంటంటే, చాదర్‌ఘాట్‌లోని హోటల్ నయాగరా. ఇక్కడి నుండి, ఓల్డ్ సిటీలోకి లోతుగా వెళితే దారుల్షిఫాలోని హోటల్ నయాబ్, పతేర్‌గట్టిలోని షహ్రాన్ హోటల్ కూడా ఫేమస్ ప్లేస్ అని చెప్పాలి. మీరు తహారీ కోసం మూడ్‌లో ఉంటే, పురానీ హవేలీలోని మెహబూబ్ కి తహారీని మాత్రం తప్పక ప్రయత్నించండి.
View this post on Instagram
బ్రేక్ ఫాస్ట్ క్లబ్ ఆఫ్ దోస
దక్షిణ భారతదేశ అల్పాహారం తీసుకోవాలనుకుంటున్నారా? ఓల్డ్ సిటీ ఆలూ, పనీర్, చీజ్ లేదా మీ మనసు కోరుకునే ఏదైనా కలిపిన వెన్న దోసెలతో నిండి ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, మోజ్జంజాహి మార్కెట్‌లోని అత్యంత ప్రసిద్ధ రామ్ కీ బందీని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. కొంచెం ముందుకు వెళితే మంగళ్‌హాట్‌లోని లక్ష్మణ్ కీ బందీ, ఘాన్సీ బజార్‌లోని గోవింద్ కీ బందీ, పతేర్‌గట్టిలోని ఆనంద్ భవన్ వంటి ఆప్షన్స్ కూడా మీకు మంచి అనుభూతినిస్తాయి.
View this post on Instagram
స్ట్రీట్ ఫుడ్ గాగాస్
సాయంత్రం ఏదైనా తినాలనే కోరిక చాలా మందిలోనూ ఉంటుంది. ఓల్డ్ సిటీలో దాదాపు ప్రతి లేన్‌లోనూ స్ట్రీట్ ఫుడ్ దుకాణాలతో నిండి ఉంటుంది. కానీ ఎక్కువగా సిఫార్సు చేసే వాటిలో ఖిల్వాట్‌లోని అక్బర్ ఫాస్ట్ ఫుడ్, చార్మినార్ సమీపంలోని మిలన్ జ్యూస్ సెంటర్, చార్ కమాన్‌లోని ఆగ్రా స్వీట్స్, ఘాన్సీ బజార్‌లోని బ్రిజ్‌వాసి చాట్ వాలా ముందుంటాయి.
View this post on Instagram
నిజాంలకు సరిపోయే భోజనం
భోజనం కోసం, తరతరాలుగా సేవ చేసిన ప్రదేశాలలోకి అడుగు పెట్టండి. ఘాన్సీ బజార్‌లోని షాదాబ్ హోటల్ ఇక్కడ నోరూరించే బిర్యానీ, కబాబ్‌లు, కూరలకు అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇంకా ముందుకు వెళితే మదీనా సర్కిల్‌లో ఐవాన్-ఎ-ఖాస్, ఖిల్వాత్‌లోని రుమాన్ హోటల్, షా అలీ బండాలో పిస్తా హౌస్, షా ఘౌస్‌లను కూడా మీరు చూడొచ్చు.
View this post on Instagram
Also Read : (VIDEO): Machilibazaar kids: మళ్లీ కలిసిన మచిలిబజార్ చిన్నారులు
Food Spots : హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బెస్ట్ ఫుడ్ స్పాట్స్ ఇవే