Badrinath Temple: 6 నెలల తర్వాత తెరుచుకున్న ఆలయం… 15 టన్నుల పూలతో అలంకారం
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఆరు నెలల మూసివేత తర్వాత తెరుచుకున్నాయి. వేద మంత్రోచ్ఛారణల మధ్య, ఆ విష్ణువు ఆలయ తలుపులు ఉదయం 6 గంటలకు అంగరంగ వైభవంగా తెరుచుకున్నాయి.
Badrinath Temple: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఆరు నెలల మూసివేత తర్వాత తెరుచుకున్నాయి. వేద మంత్రోచ్ఛారణల మధ్య, ఆ విష్ణువు ఆలయ తలుపులు ఉదయం 6 గంటలకు అంగరంగ వైభవంగా తెరుచుకున్నాయి. పదిహేను టన్నుల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా భారత సైన్యం భక్తి సంగీతాన్ని ప్లే చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్ర భట్, తెహ్రీ ఎమ్మెల్యే కిషోర్ ఉపాధ్యాయ్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా ఆలయంలో బద్రీనాథ్ ధామ్ ప్రధాన పూజారి, రావల్, ధర్మాధికారి, వేదపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంతో పాటు, బద్రీనాథ్ ధామ్‌లో ఉన్న గణేష్, ఘంటాకర్ణ, ఆది కేదారేశ్వర్, ఆది గురు శంకరాచార్య ఆలయం, మాతా మూర్తి ఆలయ ద్వారాలు కూడా ఈ రోజే తెరిచారు. ధామ్‌కు ప్రయాణం సురక్షితంగా, సజావుగా సాగేందుకు స్థానిక యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని అక్కడి అధికారులు తెలిపారు.
బద్రీనాథ్ తలుపులు తెరవడంతో, ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత, చార్ ధామ్‌లు – బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి – మూసివేస్తారు మరుసటి సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో మళ్లీ తెరుచుకుంటాయి. ఆరు నెలల పాటు జరిగే ఈ యాత్రలో, దేశవ్యాప్తంగా, విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు చార్ ధామ్‌లను సందర్శిస్తారు. హిమాలయ దేవాలయం కేదార్‌నాథ్ ద్వారాలు గత శుక్రవారం తెరుచుకున్నాయి. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 30న ఓపెన్ అయ్యాయి.
Also Read: Seema Haider: సీమా హైదర్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. అతని ఫోన్ లో అన్నీ ఆ ఫొటోలే
Badrinath Temple: 6 నెలల తర్వాత తెరుచుకున్న ఆలయం… 15 టన్నుల పూలతో అలంకారం