Cosmetic Surgery: పబ్లిక్ స్టంట్ పేరుతో పిల్లిలా మారాలనుకుంది.. చివరికి అందవిహీనంగా మారి..!
కొన్ని విషయాలు విన్నప్పుడు, కొందర్ని చూసినపుడు పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అన్న సామెత నిజమేననిపిస్తుంది. కుక్కలా కనిపించాలన్న కోరికతో అప్పుట్లో ఆ వేషధారణ కోసం దాదాపు రూ.20 లక్షలకు పైనే ఖర్చు చేసి ఓ వ్యక్తి వైరల్ అయ్యాడు. అంతవరకు బాగానే ఉంది.
Cosmetic Surgery: కొన్ని విషయాలు విన్నప్పుడు, కొందర్ని చూసినపుడు పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అన్న సామెత నిజమేననిపిస్తుంది. కుక్కలా కనిపించాలన్న కోరికతో అప్పుట్లో ఆ వేషధారణ కోసం దాదాపు రూ.20 లక్షలకు పైనే ఖర్చు చేసి ఓ వ్యక్తి వైరల్ అయ్యాడు. అంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే దాని వల్ల శరీరానికి ఎలాంటి హానీ జరగదు. కానీ ఈ మధ్య కాలంలో అందంగా కనిపించాలని, ఫేమస్ కావాలన్న అత్యాశతో ముక్కు, పెదవులు, చెంపలు వంటి శరీర భాగాల్లో సర్జరీ చేయించుకుంటున్నారు. దీని వల్ల కొంతమంది నిజంగానే అందంగా కనిపించారు. కానీ చాలా మందికి మాత్రం ఇలాంటి పనులు తీవ్ర నిరాశను మిగిల్చాయి. తాజాగా అదే తరహా ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆమె చేసిన ఘనకార్యం ఏంటో తెలిస్తే మరి మీరేమంటారో..
పిల్లిలా కనిపించాలన్న పబ్లిసిటీ స్టంట్ కోసం ఆస్ట్రేలియాలోని గోల్ కోస్ట్ కు చెందిన జోలీన్ డాసన్ అనే మహిళ ఎలాంటి పరిణామాలను ఆలోచించకుండా కాస్మెటిక్ సర్జరీకి రెడీ అయింది. కానీ ఆ నిర్ణయమే ఆమెను తీవ్ర చిక్కుల్లో పడేలా చేసింది. దీని కోసం ఆమె ఏకంగా రూ.6.6 లక్షలు కూడా వెచ్చించింది. ఏదైనా తేడా కొడుతుందని మొదట్లో కాస్త సందేహించినా.. ఆ తర్వాత మాత్రం ఎలాగోలా సర్జరీ చేయించుకుని అనేత తంటాలు పడింది. పిల్లిలా కనిపించేందుకు చెంపలను తొలగించే సర్జరీ ఆమెకు తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టింది. అయినప్పటికీ సర్జరీ సక్సెస్ కాకపోగా.. శరీరంపై అనేక దుష్ర్ఫభావాలు చూపించడం మొదలైంది.
ఇంత చేసినా ఆమె అనుకున్న కోరికను మాత్రం తీర్చుకోలేకపోయింది. పిల్లిలా మారలేదు సరికదా కింది ముఖం రూపురేఖలు దారుణంగా మారిపోయాయి. అయిందేదో అయిందనుకుని కొన్ని చికిత్సలు తీసుకున్నప్పటికీ యాసిడ్ రిఫ్లక్స్ వంటి ఊహించని దుష్ర్పభావాలు తలెత్తాయి. దీని వల్ల పిల్లి ఆకృతి కోసం అమర్చిన ఫిల్టర్లు, ఇంప్లాంట్స్ ను తీసేయాల్సి వచ్చింది. మరి ఇప్పటికైనా పరిస్థితి బాగుంటుందని ఆశిస్తున్నాననంటూ ఆమె బాధగా చెప్పుకొచ్చింది. స్టంట్ అనే పని ఎంత మతి తప్పిన పని అని ఇప్పుడైర్థమందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తనలా ఎవరూ ఇలాంటి చెత్త ప్రయోగాలు చేసి లేని పోని సమస్యలు తెచ్చుపెట్టుకోవద్దని కూడా ఆమె సూచించింది. ఏదైమైనా ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు స్టంట్స్ మరీ ఇంత ప్రమాదమా అనిపిస్తుంది కదా..!
Also Read: Jr NTR: జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలో ఆ మూవీ రిలీజ్
Cosmetic Surgery: పబ్లిక్ స్టంట్ పేరుతో పిల్లిలా మారాలనుకుంది.. చివరికి అందవిహీనంగా మారి..!