ఆన్‌లైన్ బెట్టింగ్తో మరో యువకుడు బలి
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వరంగల్ జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్తో మరో యువకుడు బలి అయ్యాడు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో లైశెట్టి భాగ్యలక్ష్మి- కుమారస్వామిల మూడవ కొడుకు లైశెట్టి రాజు కుమార్ (28) అనే యువకుడు.. ఆన్ లైన్ బెట్టింగులో సుమారు రూ.30 లక్షలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
– రూ.30 లక్షలు పొగొట్టుకున్న లైశెట్టి రాజ్‌కుమార్..
– తండ్రిని రూ.4లక్షలు కావాలని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన యువకుడు..
– డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంట్లో ఉరేసుకుని మృతి
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వరంగల్ జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్తో మరో యువకుడు బలి అయ్యాడు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో లైశెట్టి భాగ్యలక్ష్మి- కుమారస్వామిల మూడవ కొడుకు లైశెట్టి రాజు కుమార్ (28) అనే యువకుడు.. ఆన్ లైన్ బెట్టింగులో సుమారు రూ.30 లక్షలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడు రాజ్ కుమార్ తండ్రి కుమారస్వామి పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమారులు.. మూడవ కుమారుడు రాజ్ కుమార్ ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా హనుమకొండలో ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటూ కోచింగ్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో స్నేహితుల ద్వారా ఆన్ లైన్ లో పేకాట బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. అయితే, డిగ్రీ పూర్తి చేసుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అతడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. గత వారం రోజుల నుంచి రూ.4 లక్షలు కావాలని తండ్రిని రాజు కుమార్ వేధించేవాడు.
అయితే, లైశెట్టి రాజు కుమార్‌కు తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఉదయం ఇంటికి తాళం వేసి తండ్రి బయటకు వెళ్లాడు. దీంతో లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక, తండ్రి ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా కనిపించిన కొడుకును చూసి కన్నీరుమున్నిరు అవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వచ్చి కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
తన కుమారుడు లాంటి ఎంతోమంది యువకులు ఇటువంటి ఆన్‌లైన్ మోసాలకు బలైపోతున్నారని ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్‌లను రద్దుచేసి ఇలాంటి మోసాల నుండి యువతను రక్షించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
ఈజీ మనీ కోసం ఎంతోమంది బెట్టింగులు ఆడుతున్నారు. వాటికి బానిసలుగా మారి అప్పుల పాలవుతున్నారు. వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాము ఇబ్బందులు పడటమే కాకుండా కుటుంబం మెుత్తాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. యువతీయువకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈజీ మనీ కోసం ఆన్‌లైన్ బెట్టింగుల జోలికి మాత్రం వెళ్లవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: భార్యలు రాసిన మరణ శాసనం
ఆన్‌లైన్ బెట్టింగ్తో మరో యువకుడు బలి