ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ విజ్ఞప్తి తిరస్కరణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారణ జరగాలని సిట్‌కు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు. సిట్ అధికారులు ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని నందినగర్‌లోని నివాసంలో హాజరు కావాలని రెండోసారి నోటీసులు జారీ చేశారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సిట్ నోటీసుల్లో 65 ఏళ్ల వయసును దృష్టిలో ఉంచుకొని కేసీఆర్‌కు ప్రత్యేకంగా పీఎస్ వద్ద హాజరు కావాల్సిన అవసరం లేదని, హైదరాబాద్‌లోని ఏదైనా ప్రాంతంలో విచారణ జరగవచ్చని సూచించింది. కానీ కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారణ కావాలని సిట్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. సిట్ ఆయన విజ్ఞప్తిని తిరస్కరించడంతో, నగర పరిధిలోని నందినగర్ నివాసంలో విచారణ ఫిక్స్ అయ్యింది.

ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్‌రావు సిట్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నేతల స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ALSO READ: Medaram Jathara: గద్దెల వద్ద నిలువెత్తు బంగారం సమర్పించిన డీజీపీ

Last Updated on January 30, 2026 · 2:13 PM by Star Trinethram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles