Kulkarni Rajaprabhakar Rao: తెలంగాణ రక్షణ సేన కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ కులకర్ణి రాజప్రభాకర్ రావు బుధవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మద్దూరు మండలం నందిపహాడ్ గ్రామంలో నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసి క్రీడాకారులను అభినందించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన రైడ్ అండ్ రూల్ జట్టుకు మొదటి బహుమతిగా రూ.11,000, కాలాగ్ని జట్టుకు రెండో బహుమతిగా రూ.5,500 అందించారు.
ఈ సందర్భంగా కులకర్ణి రాజప్రభాకర్ రావు మాట్లాడుతూ.. నందిపహాడ్ గ్రామస్థులు తనపై చూపిస్తున్న అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ఇంకా అనేక పనులు చేయాల్సి ఉందని, ప్రజల ఆదరణను ఎల్లవేళలా గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. గ్రామస్థుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నందిపహాడ్ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తాననే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
ALSO READ: Kulkarni Rajaprabhakar Rao: కన్నీటి సంద్రంలో వెలిగిన సూర్యుడు
