HomeUncategorizedAruri Ramesh: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Aruri Ramesh: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

  • పంద్రాగస్టు రోజున నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు
  • అరూరి రమేష్ సహా 25 మందిపై కేసు

Aruri Ramesh: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో పాటు 25 మంది బీఆర్ఎస్ నాయకులపై గురువారం కేసు నమోదైంది. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేటలో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి పలు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేయడంతో పాటు, నేషనల్ హైవేపై అంబేద్కర్ సెంటర్‌లో ఎలాంటి అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారని, తద్వారా రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కార్యక్రమంలో డీజే సౌండ్ సిస్టం ఉపయోగించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారంపై వర్ధన్నపేట మునిసిపల్ ఇన్‌చార్జి కమిషనర్ కె.కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 285, 189 (2), ఆర్/డబ్ల్యూ 190బీఎన్ఎస్, 2 (4)(1) పీఐఎన్‌హెచ్‌ఏ కింద వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పతాకానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ఈ కేసులో కౌన్సిలర్లు గుజ్జ వీరన్న, తిరుపతి సురేష్, సిలివేరు కుమారస్వామి, నాయకులు తూళ్ల కుమారస్వామి, గోధుమల మధుసూదన్, తుమ్మల యాకయ్య, బానోతు నవీన్, భూక్యా రామన్న, లక్ష్మణ్‌లతో పాటు పలువురి పేర్లు ఉన్నాయి. మొత్తం 25 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు కావడంతో వర్ధన్నపేట రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: Wardhannapet: జాతీయ పతాకానికి అవమానం (VIDEO)

RELATED ARTICLES

Most Popular