AP Polycet 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించిన కీలక ప్రక్రియలు వేగవంతమయ్యాయి. 2026 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న పాలీసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి హాల్ టికెట్లను విడుదల చేసింది. ఏప్రిల్ 18 ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. పరీక్షకు దరఖాస్తు చేసిన వారు తమ పదో తరగతి హాల్ టికెట్ నంబర్ లేదా నమోదు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ ఆధారంగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి సులభంగా హాల్ టికెట్ పొందవచ్చు. దీంతో పాటు వాట్సప్ గవర్నెన్స్ సౌకర్యం ద్వారా కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని అందుబాటులో ఉంచడం విద్యార్థులకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తోంది.
ఏపీ పాలీసెట హాల్ టికెట్ల 2026 డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వాట్సప్ గవర్నెన్స్ ద్వారా హాల్ టికెట్ పొందడం కూడా సులభమైన ప్రక్రియగా రూపొందించారు. విద్యార్థులు తమ మొబైల్ నుంచి 9552300009 నంబర్‌కు వాట్సప్‌లో Hi అని మెసేజ్ పంపిన తరువాత అందుబాటులో వచ్చే ఎంపికల్లో విద్య సేవలు అనే విభాగాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత పాలీసెట్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్ అనే ఎంపికను క్లిక్ చేయాలి. తదుపరి దశలో పదో తరగతి హాల్ టికెట్ నంబర్ లేదా నమోదు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌ను నమోదు చేస్తే వెంటనే స్క్రీన్‌పై హాల్ టికెట్ ప్రదర్శితమవుతుంది. ఈ విధానం ద్వారా ఎక్కడ ఉన్నా విద్యార్థులు తక్షణమే తమ హాల్ టికెట్‌ను పొందగలుగుతారు.
ఇక పాలీసెట్ పరీక్ష ఏప్రిల్ 25 శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే ముందు అభ్యర్థులు తమ హాల్ టికెట్లో ఉన్న వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఏదైనా లోపాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయడం అవసరం. పరీక్ష రోజున హాల్ టికెట్‌ను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్ లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు.
పాలీసెట్ 2026లో సాధించిన ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన ఈ పరీక్ష ఫలితాలను మే 10, 2026న విడుదల చేసే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం ప్రక్రియలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండి సమయానికి అవసరమైన చర్యలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షకు హాజరుకాగలరు.
ALSO READ: Suicide: 30 ఏళ్లు వచ్చినా ఇక 3 ముళ్లు వేసే యోగ్యం లేదేమోనని..
Last Updated on April 18, 2026 · 2:38 PM by Sandeep Kumar



