HomeUncategorizedMale Fertility: వేడి గాలుల వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా?

Male Fertility: వేడి గాలుల వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా?

📰 Generate e-Paper Clip

Male Fertility: పెళ్లైన ప్రతి దంపతుల ఆశలో మొదటి స్థానంలో నిలిచేది తల్లిదండ్రులు కావాలనే కోరికే. అయితే కొందరు సంవత్సరాలు గడిచినా సంతానం కలగకపోవడం కుటుంబాల్లో ఆందోళనకు దారి తీస్తోంది. సంప్రదాయంగా ఇలాంటి సందర్భాల్లో మహిళలనే తప్పుబట్టే ప్రవణత ఎక్కువగా కనిపించినా, వాస్తవానికి పురుషుల్లో కూడా సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వంటి అంశాలు పురుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు పెరగడం, పని ఒత్తిడి అధికమవడం వంటి కారణాలతో చాలా మంది పురుషులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల వీర్యకణాల సంఖ్య తగ్గడం, నాణ్యత దెబ్బతినడం, హార్మోన్ స్థాయిలు అసమతుల్యం కావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

గతంలో జరిగిన పరిశోధనలు చూసినట్లయితే మరో కీలక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి. వాతావరణ మార్పులు కూడా పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వేడి వాతావరణం వీర్యకణాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించారు. యునైటెడ్ కింగ్డమ్‌లోని ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ పరిశోధన నివేదిక నేచర్ కమ్యూనికేషన్స్ మ్యాగజైన్‌లో ప్రచురించబడింది. వేడి గాలుల ప్రభావంతో వీర్యకణాల నిర్మాణం, పనితీరు దెబ్బతింటుందని పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన మాట్ గేజ్ మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతల సమయంలో వీర్యకణాల నిర్మాణ ప్రక్రియ చాలా సున్నితంగా మారుతుందని వెల్లడించారు. సంతానోత్పత్తి ప్రక్రియలో వీర్యకణాల పాత్ర అత్యంత ముఖ్యమని, వాతావరణ మార్పులు ఈ ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయని ఆయన తెలిపారు. జీవవైవిధ్యంపై కూడా ఈ ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పురుషులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ: Spiritual: అక్షయ తృతీయ రోజు తప్పకుండా బంగారం కొనుగోలు చేయాలా?

RELATED ARTICLES

Most Popular