KTR: బీఆర్ఎస్ పేరు మార్పుపై క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చేసిన కేటీఆర్

బీఆర్ఎస్ పేరు మార్పుపై వస్తోన్న ప్రచారంపై టీఆర్ఎస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లెజెండ్, కారణజన్ముడు అని పేర్కొన్న ఆయన.. కేసీఆర్ తర్వాత తనకు నచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్ అని చెప్పుకొచ్చారు.

KTR: బీఆర్ఎస్ పేరు మార్పుపై వస్తోన్న ప్రచారంపై టీఆర్ఎస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లెజెండ్, కారణజన్ముడు అని పేర్కొన్న ఆయన.. కేసీఆర్ తర్వాత తనకు నచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్ అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి చాలా అదృష్టవంతుడని, పవన్ కళ్యాణ్ తాను ఊహించిన దానికంటే ఉన్నత స్థాయికి వెళ్లారన్నారు. ఇకపోతే ప్రధానిగా మోదీ దేశానికి చేసిందేం లేదని, మతపరమైన అజెండాను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

మారింది పేరు మాత్రమే, మా జెండా మారలేదు, మా అజెండా మారలేదు, మా నాయకుడు మారలేదు, మా సిద్ధాంతం మారలేదు, మా ఎన్నికల సింబల్ కూడా మారలేదు. జాతీయ పార్టీగా ఎదగాలి, విస్తరించాలి అనే అజెండాతో వెళ్లాం. మహారాష్ట్రతో ప్రస్థానం మొదలు పెట్టాలని అనుకున్నాం. దానికి తాత్కాలికంగా ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాం. 4 లక్షలే తేడా. 37శాతం ఓటు వచ్చింది. మాకు జరిగింది దారుణమైన పరాభవం కాదు. మేము 39 సీట్లు గెలిచాం. ఈ స్పీడ్ బ్రేకర్ ను అధిగమిస్తాం. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వస్తాం.

”37శాతం మంది మాకు ఓటు వేశారు. వారికి తెలివి లేదంటారా? పేరులో ఏముంటుంది? సాంకేతికంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ మహారాష్ట్రలో పోటీ చేస్తే స్వీకరించరు. తెలంగాణ పార్టీ అనే అంటారు. అలా కాకుండా భారత రాష్ట్ర సమితి అని పేరు పెడితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోటీ చేసేందుకు వెసులుబాటు ఉంటుందని అలా పెట్టుకున్నాం. అదో పెద్ద ఇష్యూ కాదు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌవరం అది మా అజెండాలో ఆనాడూ ఉంది, ఈనాడూ ఉంది, రేపు కూడా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. టీఆర్ఎస్, బీఆర్ఎస్ అని మీరు అంటున్నారు. ఊర్లలో మమ్మల్ని తెలంగాణ పార్టీ అని అంటారు” అని కేటీఆర్ అన్నారు.

Also Read: Anakapalle: నిద్రపోతున్న భర్తపై సలసల కాగుతున్న నూనె పోసిన భార్య

KTR: బీఆర్ఎస్ పేరు మార్పుపై క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చేసిన కేటీఆర్

📲 Follow Us

Star Trinethram

Star Trinethram (Telugu News) is Top News Source That Provide Latest and Breaking News in Telugu. Read Andhra Pradesh, Telangana, National and International Telugu News Updates Online. News on Politics, Business, Entertainment, Technology, Sports, Lifestyle and more at startrinethram.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *