Mens Protest : మగాళ్లకూ రక్షణ కల్పించేలా చట్టాలు తేవాలి హీ టీమ్ ఏర్పాటుకు పెరుగుతున్న డిమాండ్
దేశంలో స్త్రీల రక్షణ కోసం అనేక చట్టాలున్నాయి. ఎలాంటి వేధింపులకు గురైనా షీ టీమ్స్ ఉన్నాయి. మరి మగాళ్ల పరిస్థితేంటి.. వాళ్లకు రక్షణ అక్కర్లేదా.. ఈ సమాజంలో వాళ్లూ ఒకరు కాదా.. వారి కోసం ఎలాంటి చట్టాలూ ఉండవా.. ఈ ప్రశ్నలు ఇప్పుడు మగవారిని తీవ్రంగా వేధిస్తున్నాయి.
Mens Protest : దేశంలో స్త్రీల రక్షణ కోసం అనేక చట్టాలున్నాయి. ఎలాంటి వేధింపులకు గురైనా షీ టీమ్స్ ఉన్నాయి. మరి మగాళ్ల పరిస్థితేంటి.. వాళ్లకు రక్షణ అక్కర్లేదా.. ఈ సమాజంలో వాళ్లూ ఒకరు కాదా.. వారి కోసం ఎలాంటి చట్టాలూ ఉండవా.. ఈ ప్రశ్నలు ఇప్పుడు మగవారిని తీవ్రంగా వేధిస్తున్నాయి. కావున ఆడవాళ్లకు ఎలాగైతే షీ టీమ్స్ ఉన్నాయో.. తమకూ హీ టీమ్స్ ఏర్పాటు చేయాలని వేలాది మంది పురుషులు ఒక్క తాటిపై నిలబడి ఇప్పుడు తమ గొంతును వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పురుషులంతా ఏకమై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం కూడా చేశారు. ఇందుకు మహిళలూ అండగా నిలవడం విశేషం.
మగవారి హక్కుల కోసం ఢిల్లీలో సత్యాగ్రహం
పురుషులకు మహిళలతో సమాన హక్కులు కల్పించాలని డిమాండ్
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం
సమాజంలో పురుషుల హక్కులను కూడా గుర్తించాలని పిలుపు pic.twitter.com/w7Yke6RDk5
— Star Trinethram Telugu (@Dheekondas10019) April 20, 2025
సేవ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో “సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూవ్‌మెంట్” పేరుతో నిర్వహించిన ధర్నాలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 2000 పురుషులు పాల్గొన్నారు. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని భర్తలపై దొంగ కేసులు బనాయించే భార్యల సంఖ్య పెరుగుతోందని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. అంతకుముందు స్వార్థం కోసం భర్తపై వరకట్నం, వేధింపుల పేరుతో కేసులు వేస్తున్న భార్యల నుంచి భర్తలను కాపాడాలని భార్యా బాధితుల సంఘం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. పురుషుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిందేనని కోరారు. 498A చట్టం వెంటనే రద్దు చేయాలని.. మొదట విచారణ జరిపాకే స్థానిక పోలీసులు కేసులు నమోదు చేయాలని పురుషులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.
ఆడవాళ్ల తరహాలోనే మగవాళ్లూ గృహహింసకు బాధితులవుతున్నారని పేర్కొంటూ.. ఆడవాళ్లకు భర్తల వేధింపుల నుంచి కాపాడేందుకు ప్రత్యేక జాతీయ మహిళా కమిషన్ ఉన్నట్లే.. అక్రమ కేసులు, గృహహింసకు గురవుతున్న భర్తల కోసం కూడా ప్రత్యేక జాతీయ కమిషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని.. మగాళ్ల కోసం ప్రత్యేక చట్టాలు, హీ టీంలు తీసుకురావాలని ధర్నాలో పాల్గొన్న భార్యాబాధితులు డిమాండ్ చేశారు. ఇప్పటివరకైతే వీరు చేస్తున్న ఈ ఉద్యమానికి విశేష స్పందన వస్తోంది. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతోంది.. కేంద్రం ఈ విషయంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అన్న విషయాలు తెలియాలంటే కేంద్రం స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.
Also Read : Teacher Video : మంచి బుద్దులు నేర్పాల్సిన టీచరే ఆ పని చేశాడు.. ఫైనల్ గా ఏమైందంటే..
Mens Protest : మగాళ్లకూ రక్షణ కల్పించేలా చట్టాలు తేవాలి హీ టీమ్ ఏర్పాటుకు పెరుగుతున్న డిమాండ్