Mystery Village: అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోర్లు.. సడెన్ గా ఊడుతున్నాయంటూ గ్రామస్థుల ఆవేదన
మహారాష్ట్రలోని బుల్దాన జిల్లా షెగావ్ తాలూకాలోని సుమారు 15 గ్రామాల ప్రజలు మూడు నెలలుగా కొనసాగుతున్న జుట్టు రాలడం అనే సమస్యతో ఆందోళన చెందుతున్నారు.
Mystery Village: మహారాష్ట్రలోని బుల్దాన జిల్లా షెగావ్ తాలూకాలోని సుమారు 15 గ్రామాల ప్రజలు మూడు నెలలుగా కొనసాగుతున్న జుట్టు రాలడం అనే సమస్యతో ఆందోళన చెందుతున్నారు. అకస్మాత్తుగా జుట్టు రాలడం అనే సమస్య ఇప్పుడు మరింత తీవ్రమైంది. అయితే గ్రామస్థులు ఇప్పుడు మరో కొత్త సమస్యతో ఆందోళన చెందుతున్నారు. అదే గోర్లు కోల్పోవడం లేదా ఊడిపోవడం. ఇది వారి ఆందోళనను పెంచుతోంది. అదే దీనికి మూల కారణాన్ని వారు ప్రశ్నించేలా చేసింది. ఈ సమస్య షెగావ్ దాటి విస్తరించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఎందుకంటే బాండ్‌గావ్ నివాసితులు జుట్టు రాలడంతో పాటు ఇప్పుడు గోర్లు కూడా రాలిపోతున్నాయని చెబుతున్నారు. ఇది ఈ ప్రాంతంలో మరింత భయాన్ని పెంచుతోంది.
Maharashtra News: Residents of Buldhana’s Shegaon Taluka are facing unexplained nail shedding. Earlier, rampant hair loss was observed in Buldhana’s Bondgaon residents. Water contamination is suspected to be the reason.
#Maharashtra #waterpollution #Buldhana #news@fpjindia pic.twitter.com/PgNcNbi1SM
— Manasi (@Manasisplaining) April 17, 2025
రెండు నెలలు గడిచినా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గ్రామస్తులను ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా అధిక నైట్రేట్ స్థాయిలు కనుగొన్న తర్వాత, జుట్టు రాలడం అనేది కలుషిత నీటీతోనూ ముడిపడి ఉందని చాలామంది అనుమానిస్తున్నారు. జిల్లా ఆరోగ్య అధికారి అమోల్ గైట్ ఈ నీరు వినియోగానికి సురక్షితం కాదని ఇప్పటికే ధృవీకరించారు. నైట్రేట్ స్థాయిలు 54 శాతంతో అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యమైన పరిమితి 10 శాతం కంటే చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
దీంతో పాటు, నీటిలో సోడియం శాతం గణనీయంగా పెరిగి 2100 వద్ద నమోదైంది. ఇది సాధారణ స్థాయి 110తో పోలిస్తే చాలా ఎక్కువ. బోండ్‌గావ్, ఖాట్ఖేడ్ నుండి 70 మందికి పైగా నివాసితులు జుట్టు రాలడం, బట్టతల ఉన్నట్లు చెప్పడంతో, అందరిలోనూ భయం మొదలైంది. ఎందుకంటే స్థానిక నీటి సరఫరా విషపూరిత స్వభావం కారణంగా ఆరోగ్య ప్రమాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read: Summer Holidays : సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయోచ్.. అప్పట్లో ఎలా ఉండేదంటే..
Mystery Village: అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోర్లు.. సడెన్ గా ఊడుతున్నాయంటూ గ్రామస్థుల ఆవేదన