HomeUncategorizedSI Srinivas: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

SI Srinivas: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

SI Srinivas: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఐనవోలు ఎస్సై శ్రీనివాస్ అన్నా రు. మంగళవారం మండల కేంద్రంతో పాటు నందనం, పున్నేలు, కొండపర్తి గ్రామాల్లో రెవెన్యూ అధికారులతో కలిసి మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

మత్తు జీవితాలను నాశనం చేస్తుందని, యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మత్తు పదార్థాల అక్రమ విక్రయాలపై సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే విధంగా స్పోర్ట్స్‌పై ఆసక్తి చూపడానికి గాను విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను ఎస్సై శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ అధికారి, ఎస్సై వెంకటేష్, సర్పంచులు గడ్డం రఘువంశీ, జెట్టబోయిన రాజు, ఉస్మాన్ అలీ, కంజర్ల సంపత్ రావు, రెవెన్యూ అధికారులు, కార్యదర్శి కిషోర్, కానిస్టేబుల్స్ తదితరులు ఉన్నారు.

ALSO READ: Bhimadevarapalli: గట్లనర్సింగాపూర్‌లో విద్యార్థులకు పరీక్ష పరికరాల పంపిణీ

RELATED ARTICLES

Most Popular