HomeUncategorizedPrabhas: ‘స్పిరిట్’ పోస్టర్‌తో సోసల్ మీడియా షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా

Prabhas: ‘స్పిరిట్’ పోస్టర్‌తో సోసల్ మీడియా షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా

📰 Generate e-Paper Clip

Prabhas: రెబల్ స్టార్‌గా అభిమానుల మనసులు గెలుచుకున్న ప్రభాస్.. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘స్పిరిట్‌’పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. షూటింగ్ శరవేగంగా సాగుతుండగా తాజాగా వచ్చిన అప్‌డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దర్శకుడు స్వయంగా ప్రకటించిన తాజా సమాచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

ఈ చిత్రంలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా దద్దరిల్లాయి. పోస్టర్‌లో ఆయన లుక్ గంభీరంగా, భయానకంగా కనిపిస్తూ కథలో ఆయన పాత్ర తీవ్రతను సూచిస్తోంది. అయితే అదే పోస్టర్‌లో వివేక్ పక్కన కనిపించిన కొత్త ముఖం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఆ నటి పేరు ఐశ్వర్య దేశాయ్. పోస్టర్ విడుదలైన క్షణాల్లోనే ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఇండియన్ అమెరికన్ నటి అయిన ఆమె ఇప్పటికే గల్లీ బాయ్ చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. నటనలో తన ప్రతిభను చాటుకున్న ఆమెకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

అలాగే ‘ర్యాట్ ఇన్ ద కిచెన్’ అనే షార్ట్ ఫిలిం ద్వారా ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకోవడం ఆమె కెరీర్‌కు మరింత బలం చేకూర్చింది. చదువులోనూ ప్రతిభ కనబరిచిన ఆమె యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుండి మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. విద్య, నటన రెండింటిలోనూ తనదైన ముద్ర వేసుకున్న ఆమె ఇప్పుడు తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతోంది.

సందీప్ చిత్రాల్లో మహిళా పాత్రలు బలంగా, ధైర్యంగా ఉండటం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యను విలన్ పాత్రతో కలిపి చూపించడం కథలో కీలక మలుపులకు సంకేతమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన కథానాయికగా త్రిప్తి డిమ్రి నటిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య పాత్ర కూడా ప్రాధాన్యత కలిగి ఉంటుందని సమాచారం. ఒక్క పోస్టర్‌తోనే ఆమెకు ఓవర్ నైట్ గుర్తింపు వచ్చినట్టే అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ALSO READ: Iran vs Israel: యుద్ధం మొదలైంది

RELATED ARTICLES

Most Popular