Odisha: 23 ఏళ్ల యువతిపై ప్రియుడు సహా ఇద్దరు అత్యాచారం.. ఆపై మరో ఘోరం

Odisha: ఒడిశా రాష్ట్రంలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో 23 ఏళ్ల యువతిపై జరిగిన అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం హత్య చేయడం సమాజాన్ని కుదిపేసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్, అత్యాచారం, హత్యకు సంబంధించిన చట్టపరమైన నిబంధనల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

జిల్లా పోలీసు అధికారి అంకిత్ కుమార్ వర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 22న ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ఆమె ప్రియుడు ఆలయానికి రమ్మని పిలిచాడు. అతని మాట నమ్మి ఇంటి నుంచి బయలుదేరిన యువతిని అతడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి, అనంతరం రహమా బస్టాండ్ వద్ద వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది.

అక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను చూసిన ఝార్ఖండ్‌కు చెందిన మరో వ్యక్తి పారాదీప్‌కు తీసుకెళ్తానని నమ్మబలికాడు. అయితే సహాయం పేరుతో ఆమెను పారాదీప్ పట్టణంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటి నాలుగో అంతస్తుకు తీసుకెళ్లి మరోసారి దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను భవనం పైభాగం నుంచి తోసేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

22 సాయంత్రం యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె సోదరుడు టిర్టోల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశాడు. మరుసటి రోజు మృతదేహం లభ్యం కావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం 25న తన సోదరిపై లైంగిక దాడి చేసి హత్య చేశారని ఆరోపిస్తూ పారాదీప్ మోడల్ పోలీస్ స్టేషన్‌లో మరో ఫిర్యాదు ఇచ్చారు. దర్యాప్తు వేగవంతం చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై బీజేడీ అధినేత, రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అమాయకుల ప్రాణాలు ఇలా పోతుండటంపై ప్రశ్నించారు. మహిళల భద్రతపై ప్రభుత్వ ప్రకటనలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని విమర్శించారు. అంగుల్, సంబల్‌పూర్, పారాదీప్ ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలు రాష్ట్ర ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని శాంతిభద్రతలను కట్టుదిట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ALSO READ: Bhadrachalam: పరీక్ష రాస్తుండగా విద్యార్థినికి గర్భస్రావం.. చివరికి బాత్‌రూమ్‌లో!..

Last Updated on February 28, 2026 · 1:37 PM by Star Trinethram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles