HomeUncategorizedAP Liquor Scam: సిట్ ఎదుట లొంగిపోయిన అవినాష్ రెడ్డి

AP Liquor Scam: సిట్ ఎదుట లొంగిపోయిన అవినాష్ రెడ్డి

📰 Generate e-Paper Clip

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి చివరకు సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం (ఫిబ్రవరి 24) తిరస్కరించడంతో విజయవాడలోని సిట్ కార్యాలయానికి తన న్యాయవాదితో కలిసి వెళ్లి సరెండర్ అయినట్లు సమాచారం.

ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా బెయిల్ లభించలేదు. జనవరి 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా ఉపశమనం దక్కలేదు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చిల నేతృత్వంలోని ధర్మాసనం అవినాష్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు విన్నది. విదేశాలకు వెళ్లిన అంశంపై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. ఏడాదికాలంగా పరారీలో ఉన్న వ్యక్తికి ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వాలి? ఏ కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లారు? అంటూ ప్రశ్నించారు. చట్టాన్ని తప్పించుకునే ప్రయత్నం చేసే వారికి రక్షణ కల్పించలేమని స్పష్టం చేశారు.

అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ ఇవ్వాలని చేసిన అభ్యర్థనను సీజేఐ తిరస్కరించారు. ఫిబ్రవరి 26న అవినాష్ శ్రీలంక నుంచి తిరిగి రానున్నారని, లుక్ అవుట్ సర్క్యులర్ (LOC)ను నిలిపివేయాలని న్యాయవాది కోరినా కోర్టు అంగీకరించలేదు. ముందుగా లొంగిపోవాలని, ఆ తర్వాతే రెగ్యులర్ లేదా మధ్యంతర బెయిల్ పిటిషన్లను పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.

లిక్కర్ స్కామ్ కేసు నమోదైన తర్వాత అవినాష్ రెడ్డి సోదరుడు అరెస్టు కావడంతో, తనను కూడా నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని భావించి విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. తాజాగా సుప్రీంకోర్టు లొంగిపోవాలని ఆదేశించడంతో మరో మార్గం లేక సిట్ కార్యాలయంలో సరెండర్ అయ్యారు.

ALSO READ: Road Safety Cess: భారీగా పెరగనున్న వాహనాల ధరలు.. ఎప్పటినుంచో తెలుసా?

RELATED ARTICLES

Most Popular