Plants: ఇంటిలో మొక్కలు పెంచడం అందాన్ని, శాంతిని, పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. చాలా మంది ఇంటి లోపల లేదా బయట వివిధ రకాల మొక్కలను పెంచి సౌందర్యాన్ని పెంపొందిస్తారు. కానీ వాస్తు శాస్త్ర నిపుణులు కొన్ని ప్రత్యేక రకాల మొక్కలను ఇంట్లో పెట్టడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు, కుటుంబ విభేదాలు, నెగటివ్ ఎనర్జీ లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువవుతాయని చెబుతున్నారు.
1. చింత పండు చెట్టు:
వాస్తు ప్రకారం ఇంటిలో లేదా ఇంటి పరిసరాల్లో చింత చెట్టు పెంచకూడదు. చింత చెట్టు పెంచడం వలన ఆర్థిక ఇబ్బందులు, అనుకోని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది.
2. గోరింటాకు:
చాలా మంది గోరింటాకు మొక్కను ఇంట్లో పెంచుకుంటారు. కానీ వాస్తు నిపుణుల ప్రకారం, గోరింటాకు ఇంట్లో ఉండటం దుష్ట శక్తుల ప్రభావంతో పేదరికాన్ని కలిగిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే కుటుంబ శాంతి దెబ్బతింటుందని చెబుతున్నారు.
3. ఎండిన మొక్కలు:
ఇంటిలో ఎప్పుడూ ఎండిపోయిన, ఆరిపోయిన మొక్కలు ఉండకూడదు. ఇవి నెగటివ్ ఎనర్జీని తీసుకువచ్చి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఆర్థిక సమస్యలు, అనేక ప్రతికూల పరిస్థితులు కలిగిస్తాయి.
4. నల్ల తుమ్మ చెట్టు:
ఇంటివద్ద లేదా పరిసరాల్లో నల్ల తుమ్మ చెట్టు పెంచడం మానసిక మరియు సామాజిక సమస్యలకు దారి తీస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, శాంతిహీనత, సమస్యలు పెరుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరించారు.
వాస్తు నిపుణుల సూచనల ప్రకారం.. ఈ నాలుగు రకాల మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే తీసివేయడం మంచిది. ఈ సమాచారం మత విశ్వాసాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది మరియు శాస్త్రీయ ఆధారాలు లేవు. ‘స్టార్ త్రినేత్రం’ దీనిని ధృవీకరించలేదు.
ALSO READ: Oh my God: రన్నింగ్ ట్రైన్లో మహిళ పిచ్చి పనులు (VIDEO)
Plants: మీ ఇంటికి పేదరికం తీసుకువచ్చే నాలుగు మొక్కలు ఇవే..?


