Andhra: కర్నూలు జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేవలం 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడటంతో ప్రాంతంలో కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే… ఎమ్మిగనూరు వెంకటాపురం కాలనీలో నివసిస్తున్న శేఖర్, శారద దంపతులకు ఒక కుమారుడు పవన్ (11), ఒక కుమార్తె ఉన్నారు. శేఖర్ స్థానికంగా కిరాణా దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు.
దసరా సెలవులు కావడంతో పవన్ ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతూ మొబైల్‌లో మునిగిపోయేవాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అతన్ని మందలించి, ఫోన్ లాక్కొన్నారు. దీనికి మనస్థాపం చెందిన పవన్, ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. కొంతసేపటికి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
తలుపు పగలగొట్టి చూడగా, పవన్ ఉరివేసుకుని అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. పవన్ మృతి కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది. చిన్న వయసులోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అందరినీ కలచివేస్తోంది.


