MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల పోరు.. హీటెక్కిన రాజకీయాలు.. రసవత్తరంగా సాగుతోన్న ప్రచారం
MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలతో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి.
MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలతో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్న రీతిలో నడుస్తోంది. అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేలుస్తూ వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది.
అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ తన ప్రచారం కోసం కొంతమంది మంత్రులను కూడా ఎంపిక చేసుకుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ తరపున చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. మరోపక్క ఈ నియోజకవర్గాల్లో బిజెపి కూడా దూకుడుగా ప్రచారం చేస్తోంది. కేంద్ర బొగ్గు మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పునరావృతం చేయడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుండటంతో, ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ కఠినమైన పోరాటాన్ని ఎదుర్కొంటోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోపక్క ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 19,107 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. ఇందులో 17,141 మంది పట్టభద్రులు కాగా, 1,966 మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు.
ఎన్నికల నేపథ్యంలో మూడ్రోజుల పాటు ఆయా జిల్లాల్లో వైన్ షాపులు బంద్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో ఈనెల 25 నుంచి 27 సాయంత్రం వరకు అంటే మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఈ బంద్ హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్తించనుంది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 3న వెలువడనున్నాయి.
ALSO READ: Wedding bustle: అక్కినేని ఫ్యామిలిలో మరోసారి పెళ్లి సందడి.. వారి సెంటిమెంట్ ప్లేస్‌లోనేనట పెళ్లి
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల పోరు.. హీటెక్కిన రాజకీయాలు.. రసవత్తరంగా సాగుతోన్న ప్రచారం