Man Gets 4 Degreees, 3 PGs Completed in Jail at Kadapa

Andhra: రియల్లీ గ్రేట్.. జైల్లో ఉంటూనే 4 డిగ్రీలు, 3 పీజీలు కంప్లీట్ చేశాడు

Andhra Pradesh

Andhra: జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ విద్యారంగంలో గొప్ప స్థానం సంపాదించాడు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చెంగాలపల్లికి చెందిన జి. యుగంధర్ (43) అనే వ్యక్తి ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ఆ కేసులో నేరం నిర్ధారించడంతో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. 2010 నుంచి కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు.

జైలులో ఉన్నప్పటికీ చదువు మీద ఆసక్తి కోల్పోలేదు. దూరవిద్య ద్వారా మొదట ఇంటర్ పూర్తి చేసి, తర్వాత ఉన్నత విద్యలో అడుగుపెట్టాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరవిద్య విశ్వవిద్యాలయం పాత సిలబస్‌లో రెండు బీఏలు, కొత్త సిలబస్‌లో మరో రెండు బీఏలు పూర్తిచేశాడు. అదంతా సరిపోలనట్టు మూడు ఎంఏలు కూడా సాధించాడు. చదువుతో పాటు కంప్యూటర్, కార్పెంటర్ శిక్షణ కూడా పొందాడు. అంతేకాకుండా న్యాక్ సర్టిఫికేట్ సాధించి, మూడేళ్ల పాటు పారా లీగల్ వాలంటీర్గా పనిచేశాడు.

ఇటీవల బీఏ పరీక్షల్లో 8.02 పాయింట్లు సాధించి, తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మార్కులు తెచ్చుకున్నాడు. ఈ విజయంతో ఆయనకు బంగారు పతకం, బుక్ ప్రైజ్ అవార్డు వరించాయి. సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో జరిగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరవిద్య విశ్వవిద్యాలయ 26వ స్నాతకోత్సవంలో ఈ అవార్డులు అందుకోబోతున్నాడు.

జైల్లో ఉన్నప్పటికీ యుగంధర్ కష్టపడి సాధించిన ఈ విజయం అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఆయన సాధన, పట్టుదల విద్య అంటే కేవలం పాఠశాలలు, కళాశాలలు మాత్రమే కాకుండా, మనసులో ఉండే పట్టుదల, శ్రమతో ఎక్కడైనా సాధించవచ్చని స్పష్టంగా చూపిస్తోంది.

Also Read: Sweets: స్వీట్స్ తెగ లాగించేస్తున్నారా.. ఐతే మీ కళ్లకు రిస్క్ తప్పదు

Andhra: రియల్లీ గ్రేట్.. జైల్లో ఉంటూనే 4 డిగ్రీలు, 3 పీజీలు కంప్లీట్ చేశాడు