Online games: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై మానసిక రోగుల్లా మారుతోన్న యువత
Online games: టెక్నాలజీ పెరిగే కొద్దీ, దాని వల్ల కలిగే ప్రమాదాలు, నేరాలూ పెరుగుతున్నాయి. ఆన్ లైన్ గేమింగ్ కు బానిసై ఇప్పటికే చాలా మంది విద్యార్థులు, యువత ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు నేరాలకు పాల్పడి, కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నారు.
Online games: టెక్నాలజీ పెరిగే కొద్దీ, దాని వల్ల కలిగే ప్రమాదాలు, నేరాలూ పెరుగుతున్నాయి. ఆన్ లైన్ గేమింగ్ కు బానిసై ఇప్పటికే చాలా మంది విద్యార్థులు, యువత ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు నేరాలకు పాల్పడి, కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నారు.
ఏ పిల్లవాడి చేతిలో చూసినా ఫోన్ కనిపించడం ఇటీవలి కాలంలో కామన్ అయిపోయింది. అది ఇవ్వకపోతే నానా గొడవ చేయడం కూడా చూస్తూనే ఉంటాం. రీసెంట్ గా ఓ ఆన్లైన్ గేమ్ కు బానిసైన బీటెక్ చదివే కుర్రాడు.. కన్న తల్లినే కత్తి పొడిచి, చంపేశాడు. ల్యాప్ టాప్ ఇవ్వాలంటూ జరిగిన పెనుగులాటలో తన తల్లిని దారుణంగా హత్య చేశాడు.
విశాఖకు చెందిన ఓ విద్యార్థి 9వ తరగతిలోనే చదువు మానేసి, చిన్న వయసులోనే పెద్దవాళ్లతో పరిచయాలు పెంచుకున్నాడు. తండ్రి లేకపోవడంతో కుటుంబ భారమంతా తల్లిపైనే పడింది. ఆమె రోజూ కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే ఎలాంటి భయం లేకుండా, బరువు, బాధ్యతలు లేకుండా పెరిగిన ఆ పిల్లాడు.. రాత్రిళ్లు ఆలస్యంగా రావడం, ఎప్పుడూ ఫోన్లో మునిగిపోవడం గమనించిన ఆ తల్లి.. అతనితో రోజూ వాదించేది.
ఫోన్ పక్కన పెట్టమని అభ్యర్థించేది. కానీ అతను మాత్రం తన మితిమీరిన ప్రవర్తనను మానుకోలేదు. ఇంటర్ వయసుకు వచ్చిన ఆ కుర్రాడు.. ఓ రోజు తల్లి తిట్టిందని కోపంతో ఆమె గుండెలపై కొట్టి, గొంతు నులిమి చంపేశాడు. ప్రస్తుతం అతన్ని పట్టించుకునేవారెవ్వరూ లేకపోవడంతో మానసిక రోగిలా మారిపోయాడు.
ఇలాంటి ఘటనలు చెప్పుకుంటూపోతే కోకొల్లలుగానే ఉంటాయి. 14ఏళ్ల పిలల్లు 81.4శాతం, 15ఏళ్ల పిల్లలు 82.2శాతం, 16ఏళ్ల పిల్లలు 84.4శాతం సోషల్ మీడియా పేరుతో ఫోన్ వినియోగిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. 2024లో చేసిన సర్వేలోనూ 60శాతం పట్టణ పిల్లలు రోజూ 3 గంటల పాటు ఫోన్ కు అతుక్కుపోతున్నారట.
దానికి తోడు కొందరు తల్లిదండ్రులు కట్టడి చేయకపోవడం, తమ పనుల్లో బిజీగా ఉండడం, పట్టించుకోకపోవడం, తేలికగా తీసిపారేయడం వంటి కారణాల వల్ల పిల్లలు మరింత పాడయ్యే అవకాశముంటోందని నిపుణులు అంటున్నారు.
Online games: ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై మానసిక రోగుల్లా మారుతోన్న యువత