Theft of jewellery: 10 సెకన్లలో రూ.30 లక్షల విలువైన ఆభరణాలు చోరీ
Theft of jewellery: దొంగలు రోజుకో కొత్త ప్లాన్ లతో దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికీ.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దోపిడీ చేస్తున్నారు. తాజాగా ఓ దొంగ రూ.30 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. అది కూడా కేవలం 10 సెకన్లలోనే. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.

వీర్పూర్కు చెందిన కిరణ్ సాహ్ వీర్పూర్ మార్కెట్లోని మజార్ చౌక్ సమీపంలోని నగల దుకాణం యజమాని. ఆయన ఉదయం 10:45 గంటల ప్రాంతంలో షాపు వద్దకు వచ్చి ఒక షట్టర్ తెరిచిన తర్వాత మరో షట్టర్‌ను తెరిచేందుకు పక్కకు వెళ్లాడు. ఆ సమయంలో తాను వెంట తెచ్చిన బ్యాగును దొంగలు చాకచాక్యంగా దొంగిలించారు.
షట్టర్ తెరిచి వచ్చి చూసేసరికి బ్యాగ్ కనిపించకపోవడంతో యజమాని ఆందోళనకు గురై, కేకలు వేశాడు. పరిస్థితిని అవకాశంగా తీసుకుని నిందితులు అక్కడ్నుంచి బ్యాగ్ తో పాటు పరారయ్యారు. ఈ ఘటనపై షా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సన్నివేశమంతా కూడా అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైంది. దీంతో ఫుటేజీలో కనిపించిన యువకులను గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
బ్యాగ్‌లో ఏమేం ఉన్నాయంటే..
దుకాణదారుడు కిరణ్ సాహ్ ప్రకారం, దొంగతనానికి గురైన బ్యాగ్ లో 400 గ్రాముల బంగారు ఆభరణాలు, షాపు లాకర్ తాళాలు ఉన్నాయి. అయితే తాము ప్రస్తుతం సీసీటీవీ కెమెరాను తనిఖీ చేస్తున్నామని, యజమాని ఇంకా రాతపూర్వక దరఖాస్తు ఇవ్వలేదని, అది అందిన తర్వాత బ్యాగ్ లో ఏమేం ఉన్నాయో, వాటి విలువెంతో స్పష్టంగా చెబుతామని ఎస్‌హెచ్‌వో సంజీవ్‌కుమార్ తెలిపారు.
బ్యాగ్‌లో ఉన్న బంగారం మొత్తం దుకాణదారు చెబుతున్నంతగా లేదని, బ్యాగ్‌లో 400 గ్రాముల బంగారు ఆభరణాలకు సంబంధించిన పత్రాలను దుకాణదారుడు ఇంకా చూపించలేదని, ఒకవేళ అంత విలువైన బంగారం బ్యాగ్ లో లేకపోవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
ALSO READ: ఇదెక్కడి చోద్యం.. బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్
Theft of jewellery: 10 సెకన్లలో రూ.30 లక్షల విలువైన ఆభరణాలు చోరీ