పాకిస్తానీ ఉగ్రవాదులతో వరంగల్‌కు పొంచి ఉన్న ముప్పు
ఉగ్రవాదం.. ఈ పేరు వింటేనే హడలిపోతారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ఇక బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రదాడులు చాలా వరకు తగ్గాయనే చెప్పాలి. నిజానికి ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఉగ్రవాద భయం వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా తెలంగాణలో ఓ జిల్లాలో చిన్న షాప్ నడుపుకుంటున్న ఓ వ్యక్తి పాకిస్తానీ ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా.. కానీ ఇది నిజం. తాజాగా ఈ సంఘటన దేశం మొత్తం నివ్వెరపోయేలా చేస్తుంది.

వరంగల్ జిల్లాలో శివనగర్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలో బిర్యాని సెంటర్ నడిపే జక్రియాకు పాకిస్తానీ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు తేలింది. గత కొన్నాళ్ళుగా ఇక్కడ బిర్యాని సెంటర్ నడుపుతున్న ఈ వ్యక్తి… పాకిస్తానీ ఉగ్రవాదులతో తరచూ సంభాషించడమే కాకుండా.. పలు విషయాలను పంచుకుంటున్నట్టు తెలిసింది. ఇక అతడు ఎలాంటి సమాచారం అందించాడు? ఇతనికి ఉగ్రవాదులతో ఉన్న సంబంధం ఏంటి? అనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈనెల 25వ తారీఖున శ్రీలంక వెళుతుండగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో జక్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణ మరింత ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఈ విషయం వరంగల్ తో పాటు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తుంది.
ప్రమాదాలు ఎక్కడో పొంచి ఉండవని.. ప్రతి ఒక్కరూ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని… ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.