టెన్త్ విద్యార్థి: చదవలేకపోతున్నా అమ్మా.. క్షమించు వెళ్లిపోతున్నా..
పాపం.. ఏం కష్టం వచ్చిందో ఏమో ఎంతో ఉన్నత స్థాయికి వస్తాడనుకున్న కొడుకు అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రయోజికుడిగా మారి తమ కలలు నెరవేరుస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి శవంగా మిగిలాడు. ఎంతో ఉన్నత స్థాయిలో చూస్తాం అనుకున్న తమ కొడుకుని ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని చూడటం ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఈ హృదయ విదారక సంఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.

పల్నాడు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురంలో దారుణం చోటుచేసుకుంది. టెన్త్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆ అబ్బాయిని తండ్రి స్కూల్ కి వెళ్ళమనడంతో తాను ఇంకా చదవలేనని స్నేహితులతో చెప్పి ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకొని మృతి చెందాడు. ఈ ఊహించని హఠాత్పరిణామానికి ఆ అబ్బాయి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
పల్నాడు జిల్లా లక్ష్మీపురంలో ఉంటున్న హనుమంతరావు, లక్ష్మీ దంపతుల కుమారుడు అమర్ పదో తరగతి చదువుతున్నాడు. దగ్గర్లో ఉన్న కారంపూడి మండలంలో స్కూల్లో జాయిన్ చేశారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇంటికి వచ్చిన ఈ పిల్లాడిని తండ్రి స్కూల్ కి వెళ్ళమని చెప్పాడు. అయితే కదా కొన్నాళ్లుగా స్కూల్లో చదువు భారంగా అనిపించడంతో పాటు ఇంటికి దూరంగా ఉండటంతో మానసిక ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ ఉన్న సమయంలోనే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని ఫ్యాన్ కు ఉరేసుకొని మృతి చెందాడు. ఇంతలోనే గమనించిన తల్లి, తండ్రి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చేతికి అంది వచ్చిన కొడుకును ఇలాంటి స్థితిలో చూసిన తల్లిదండ్రులు శోకం ఆకాశాన్ని అంటుంది.