Sri Chaitanya is playing with children’s lives: పిల్లల ప్రాణాలతో శ్రీ చైతన్య చెలగాటం.. దారుణ పరిస్థితుల్లో కిచెన్, వంటసామాగ్రి
Sri Chaitanya is playing with children's lives: దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన శ్రీ చైతన్య విద్యా సంస్థల గురించి ఈ మధ్య కాలంలో పలు ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని.. అందుకే ఎంతో మంది చనిపోతున్నానే వాదనలు వినిపిస్తూ వస్తున్నాయి.
Sri Chaitanya is playing with children’s lives: దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన శ్రీ చైతన్య విద్యా సంస్థల గురించి ఈ మధ్య కాలంలో పలు ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని.. అందుకే ఎంతో మంది చనిపోతున్నానే వాదనలు వినిపిస్తూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లోని శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంటర్ కిచెన్ లైసెన్స్ ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. కిచెన్ లో తయారు చేసే ఆహారంలో నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణమని తెలుస్తుంది.
హైదరాబాద్ మాదాపూర్ లోని శ్రీ చైతన్య విద్యా సంస్థకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ను తాజాగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. కిచెన్ లో ఆహార తయారీలో ఎంతో నిర్లక్ష్యం చూపిస్తున్నారని.. ఇందుకు తక్షణమే ఇక్కడ ఆహారాన్ని తయారు చేయడం నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. స్టూడెంట్స్ ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారని.. ఈ ఉత్తర్వులు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది
తాజాగా శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఫుడ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.ఈ నేపథ్యంలో పలు కళాశాలలకు ఇక్కడినుంచే ఫుడ్ సప్లై చేస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో కిచెన్ లో పరిశీలించగా.. ఎంతో అపరిశుభ్రంగా కనిపించింది. పాడైపోయిన ఆహారంతో పాటు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను గుర్తించారు. వెంటనే వాటిని సీజ్ చేసి ఫుడ్ చెకింగ్ కు పంపారు. ఇక్కడ ఆహారాన్ని తయారు చేయడం నిలిపివేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది.
ALSO READ: A woman’s mouth does not hide secrets: ఆడవారి నోటిలో రహస్యాలు దాగవు.. ఎందుకో తెలుసా?
Sri Chaitanya is playing with children’s lives: పిల్లల ప్రాణాలతో శ్రీ చైతన్య చెలగాటం.. దారుణ పరిస్థితుల్లో కిచెన్, వంటసామాగ్రి