koottickal jayachandran: 4 ఏళ్ల బాలికపై ప్రముఖ నటుడు అత్యాచారం.. లుక్ అవుట్ నోటీసులు జారీ
koottickal jayachandran: ప్రముఖ మలయాళ నటుడు కూటిక్కల్ జయచంద్రన్ పై కేరళ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఫోక్సో కేసులో తప్పించుకొని తిరుగుతున్న ఈ నటుడు నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

మలయాళీ నటుడు కూటిక్కల్ జయచంద్రన్ నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జయచంద్రన్ పై కోజికోడ్ లోని కసబ పోలీస్ స్టేషన్లో గత ఏడాది ఈ విషయంపై కేసు నమోదు అయింది. బాదిత బాలిక తల్లి ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 376(2)n, 376AB కింద విచారణ ప్రారంభించారు.
ఈ కేసు విషయంలో ముందు నుంచి అప్రమత్తంగా ఉన్న జయచంద్ర ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేపట్టారు. కేరళ హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించగా ఎదురుదెబ్బ తగిలింది. అంతకు ముందు కోజికోడ్ సెషన్స్ కోర్టు కూడా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు జయచంద్రన్ పై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. ఆయన ఆచూకీ తెలిసినవారు వెంటనే కసబా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
54 ఏళ్ల జయచంద్రన్ నాలుగేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని.. ఇందులో వేధింపులకు గురైంది అనే విషయం తెలిందని ప్రముఖ న్యాయమూర్తి జి గిరీష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనిని పరిగణలోకి తీసుకొని కోర్టు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ALSO READ: అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
koottickal jayachandran: 4 ఏళ్ల బాలికపై ప్రముఖ నటుడు అత్యాచారం.. లుక్ అవుట్ నోటీసులు జారీ