EV: ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతున్న ఈ రోజుల్లో, తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందిస్తున్న స్కూటర్లు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాంటి జాబితాలో తాజాగా చర్చకు వస్తున్న స్కూటర్ ఒకటి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఇప్పటివరకు వచ్చిన రివ్యూలు ఎక్కువగా పాజిటివ్‌గానే ఉన్నాయి. డిజైన్ నుంచి డ్రైవింగ్ అనుభవం వరకు, బ్యాటరీ పనితీరు నుంచి బ్రేకింగ్ సిస్టమ్ వరకూ చాలా అంశాల్లో యూజర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ధర విషయంలో ఇది మిగతా బ్రాండ్ల స్కూటర్లతో పోలిస్తే సుమారు రూ.5 వేల వరకు తక్కువగా అందుబాటులోకి వస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ ఆఫర్లతో ఈ ధర మరింత ఆకర్షణీయంగా మారడం గమనార్హం.
ఈ స్కూటర్‌ను MIOOX కంపెనీ తయారు చేసింది. మెటాలిక్ రెడ్ కలర్లో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ మొదటి చూపులోనే ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. యువతతో పాటు పెద్దవారు కూడా సులభంగా నడిపేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. స్పోర్టీ లుక్ ఇచ్చేలా ఏరోడైనమిక్ బాడీ ప్యానెల్స్ అమర్చారు. ముందు భాగంలో LED హెడ్‌లైట్స్ ఉండటం వల్ల రాత్రి ప్రయాణాల్లో రోడ్డుపై స్పష్టమైన విజిబిలిటీ లభిస్తుందని యూజర్లు చెబుతున్నారు. భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ స్కూటర్‌కు డిస్క్ బ్రేక్ సిస్టమ్‌ను అందించారు. దాంతో అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితుల్లోనూ స్కూటర్ కంట్రోల్ తప్పకుండా ఉంటుందన్న నమ్మకం కలుగుతోంది.
స్కూటర్ మొత్తం బరువు సుమారు 90 కేజీలుగా కంపెనీ పేర్కొంది. అయితే ఇది గరిష్టంగా 200 కేజీల వరకు బరువు మోయగల సామర్థ్యం కలిగి ఉందని సమాచారం. అందువల్ల ఇద్దరు కలిసి ప్రయాణించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వినియోగదారులు చెబుతున్నారు. రోజువారీ ప్రయాణాలు, చిన్నచిన్న పనుల కోసం ఈ స్కూటర్ సరిపోతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిలో వాటర్‌ప్రూఫ్ లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. 48V, 30Ah సామర్థ్యం కలిగిన ఈ బ్యాటరీ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుందని తెలిపారు. ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఈ స్కూటర్ 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కొన్ని యూజర్ రివ్యూలలో అయితే డ్రైవింగ్ విధానం, లోడ్ ఆధారంగా 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు కూడా మైలేజ్ వస్తోందని పేర్కొన్నారు. టాప్ స్పీడ్ గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల మధ్య ఉంటుందని సమాచారం. అయితే ఈ స్కూటర్లోని బ్యాటరీని బయటకు తీసి ఛార్జ్ చేసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయంపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. రిమూవబుల్ బ్యాటరీ ఉంటే, ఇంట్లోనో లేదా ఆఫీస్‌లోనో సులభంగా ఛార్జ్ చేసుకునే వీలుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఈ స్కూటర్ బ్యాటరీకి, వాహనానికి ఒక సంవత్సరం వారంటీ అందిస్తున్నారు. బ్యాటరీని కనీసం 3,000 నుంచి 5,000 సార్లు ఛార్జ్ చేసుకునేలా రూపొందించారని, దాంతో సుమారు 8 నుంచి 10 ఏళ్ల వరకు పనికొచ్చే అవకాశముందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. బ్యాటరీ బరువు దాదాపు 12 కేజీలుగా ఉంటుందని సమాచారం. ఛార్జ్ చేసే సమయంలో ముందు ఛార్జర్‌ను స్కూటర్‌కు కనెక్ట్ చేసి, తర్వాత ప్లగ్ బోర్డుకు కనెక్షన్ ఇవ్వాలని సూచనలు ఇస్తున్నారు.
కంఫర్ట్ విషయంలో కూడా ఈ స్కూటర్‌పై మంచి అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. విశాలమైన సీటుతో పాటు వెనక కూర్చునేవారి కోసం బ్యాక్ రెస్ట్‌ను అందించారు. దీని వల్ల ప్రయాణంలో భద్రత, సౌకర్యం రెండూ లభిస్తాయని యూజర్లు చెబుతున్నారు. లాంగ్ రైడ్స్కూ ఇది అనువుగా ఉంటుందని అభిప్రాయం. యూజర్ ఫ్రెండ్లీ డ్యాష్‌బోర్డ్, స్పష్టంగా కనిపించే డిస్ప్లే ప్యానెల్ ఉండటంతో స్పీడ్, బ్యాటరీ స్టేటస్ వంటి వివరాలను సులభంగా గమనించవచ్చు. స్విచ్‌లు కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశారు. రియర్ వ్యూ మిర్రర్స్ వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలపై స్పష్టమైన అవగాహన కలుగుతుంది.
సీటు కింద చిన్న స్టోరేజ్ కంపార్ట్మెంట్ను కూడా అందించారు. అందులో చిన్నచిన్న సామాన్లు, అవసరమైన వస్తువులు పెట్టుకోవచ్చు. ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ డిజైన్ ఉండటం వల్ల బ్యాగులు, సరుకులు తీసుకెళ్లడం మరింత సులభంగా మారింది. రోడ్డు పరిస్థితులు ఎలా ఉన్నా ప్రయాణం సౌకర్యంగా ఉండేందుకు ముందు, వెనుక భాగాల్లో డబుల్ స్ప్రింగ్ షాక్ అబ్జార్బర్లను అమర్చారు. దీంతో గుంతల రోడ్లపై కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా స్కూటర్ సాఫీగా నడుస్తుందని యూజర్లు చెబుతున్నారు.
ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్కూటర్‌కు రెండు రిమోట్ అలారంలు ఇస్తున్నారు. దూరం నుంచే వాహనం ఎక్కడ ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒక్క క్లిక్‌తో స్కూటర్ స్టార్ట్ అయ్యే ఆటో స్టార్ట్ ఫీచర్‌తో పాటు కీ స్టార్ట్ ఆప్షన్ కూడా అందించారు. భద్రతను మరింత పెంచేలా యాంటీ థెఫ్ట్ అలారం ఏర్పాటు చేశారు. హెడ్లైట్కు ఏంజెల్ డెవిల్ ఐ డిజైన్ ఇవ్వడం వల్ల లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. స్పీడ్‌ను నియంత్రించుకునేందుకు మూడు రకాల మోడ్ బటన్స్ అందించారు. ప్రయాణంలో మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకునేందుకు USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. వాక్యూమ్ టైర్లు ఉపయోగించారని, ఇవి సులభంగా పేలే అవకాశాలు తక్కువగా ఉంటాయని కంపెనీ చెబుతోంది.
ధర విషయానికి వస్తే.. ఈ స్కూటర్ అసలు ధర రూ.69,999గా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో సుమారు 30 శాతం డిస్కౌంట్‌తో రూ.48,899కి అందుబాటులో ఉంది. EMI ద్వారా కొనాలనుకుంటే నెలకు సుమారు రూ.1,719 చెల్లించేలా ఆప్షన్ ఉంది. దీనితో పాటు రూ.2,000 విలువైన కూపన్, రూ.1,466 క్యాష్‌బ్యాక్, రూ.1,500 వరకు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయని సమాచారం. అయితే ఇవన్నీ అర్హత ఉన్న వినియోగదారులకు మాత్రమే వర్తిస్తాయని గమనించాల్సి ఉంటుంది.
రివ్యూల పరంగా చూస్తే.. ఇప్పటివరకు కొద్దిమంది వినియోగదారులే ఈ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. అమెజాన్‌లో మొత్తం ఏడుగురు రివ్యూల ఆధారంగా దీనికి 4.3/5 రేటింగ్ వచ్చింది. యూజర్లు ఎక్కువయ్యే కొద్దీ మరిన్ని స్పష్టమైన అభిప్రాయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రివ్యూలలో స్కూటర్ లుక్, కలర్, డిస్క్ బ్రేక్ పనితీరు, డీసెంట్ స్పీడ్‌పై మంచి కామెంట్స్ ఉన్నాయి. నాలుగు నెలల వాడకం తర్వాత రివ్యూ ఇచ్చిన ఓ యూజర్ స్కూటర్ పనితీరు బాగుందని, కంపెనీ సిబ్బంది స్పందన, సర్వీస్ సంతృప్తికరంగా ఉందని తెలిపారు. మరో యూజర్ మైలేజ్, బిల్డ్ క్వాలిటీ, స్టెబిలిటీ, బ్రేకింగ్‌పై ప్రశంసలు కురిపించారు. రోజువారీ వాడకానికి ఇది సరైన ఎంపిక అని, పెద్దవాళ్లకు కూడా సేఫ్‌గా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఒక యూజర్ మాత్రం ఛార్జర్ సరిగా పనిచేయడంలేదని, బ్యాటరీ తక్కువగా ఉన్నా గ్రీన్ లైట్ చూపిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మొత్తం విషయాలు పరిశీలిస్తే.. ఫీచర్లు, డిజైన్, ధర, రివ్యూల ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే బ్యాటరీ రిమూవబుల్ ఆప్షన్, ఫ్రంట్ టైర్‌కు డిస్క్ బ్రేక్ ఉందా లేదా అనే విషయాల్లో స్పష్టత తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఈ స్కూటర్‌కు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం అవుతాయి. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద రిజిస్ట్రేషన్ ఫీజులు, పన్నులు మినహాయింపు లభిస్తే అదనపు ఖర్చు తగ్గే అవకాశం ఉంది.
NOTE: అయితే కొనుగోలుదారులు కొనుగోలు ముందు కంపెనీ ప్రతినిధులు, అమెజాన్ ప్రతినిధులతో మాట్లాడి అన్ని వివరాలు క్లారిటీ చేసుకోవడం ఉత్తమం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న సమాచారం యూజర్ రివ్యూలు, ఆన్లైన్లో లభ్యమైన వివరాల ఆధారంగా మాత్రమేనని, తుది నిర్ణయం వినియోగదారులదేనని గుర్తుంచుకోవాలి. ఈ ప్రొడక్ట్‌కి సంబంధించి ‘స్టార్ త్రినేత్రం’ మీకు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వట్లేదని గమనించగలరు.
ALSO READ: మల్లెపూల మాదిరిగా మెత్తటి ఇడ్లీలు ఎలా చేయాలో తెలుసా?
Last Updated on February 10, 2026 · 8:56 AM by Star Trinethram



