ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్ సత్య శారద
స్టార్ త్రినేత్రం, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు ఆదేశించారు.
స్టార్ త్రినేత్రం, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు ఆదేశించారు. బుధవారం సంగెం మండలం పల్లరుగూడ గ్రామంలో, చెన్నారావుపేట మండలంలోని చెన్నారావుపేట, జీడిగడ్డ తండా, కొనాపురం గ్రామాల్లో నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేశారు.
ఈ సందర్భంగా సర్వే సిబ్బందితో మాట్లాడారు. యాప్‌లో ఏమైనా సమస్యలు వస్తున్నాయా? అని అడిగారు. యాప్‌లోని కాలాంశాల ప్రకారం వివరాలను నమోదు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు జిల్లా మొత్తానికి 79 శాతం సర్వే నమోదైందని, సర్వే పూర్తయిన గ్రామాల సిబ్బందిని సర్వే పూర్తికాని గ్రామాలకు పంపి సర్వేను వేగంగా చేపట్టి గురువారం సాయంత్రం నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ వంద శాతం పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా పరిషత్తు సీఈఓ రామిరెడ్డి, ఎంపిడిఓలు, తహసీల్దార్లు, సర్వే సిబ్బంది తదితరులు ఉన్నారు.
ALSO READ: స్టార్ త్రినేత్రం క్యాలెండర్ ఆవిష్కరించిన TSCAB చైర్మన్ మార్నేని రవీందర్ రావు
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్ సత్య శారద