‘వ్యవసాయం భారతదేశానికి వెన్నెముక లాంటిది’
స్టార్ త్రినేత్రం, హన్మకొండ: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సోమవారం నక్కలగుట్టలోని శ్రీచైతన్య పాఠశాలలో రైతు దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతులను ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల డీన్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు.

వ్యవసాయం భారతదేశానికి వెన్నెముక లాంటిదని, మన దేశ జనాభాలో దాదాపు 58% మందికి ఉపాధిని కల్పిస్తోంది కూడా వ్యవసాయమేనని గుర్తుచేశారు. అలాంటి రైతు లేదా కిసాన్ దినోత్సవాన్ని డిసెంబర్ 23న దేశవ్యాప్తంగా జరుపుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేశానికి తిండి పెట్టే రైతు ముఖ్యమని, విద్యార్థులు రైతులపట్ల సహృద్భావం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వాలు రైతుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ శ్రీధర్, అకాడమిక్ డైరెక్టర్ శ్రీవిద్య, ఏ.పీ.ఎం రాజేశ్వర్ రెడ్డి, కో-ఆర్డినేటర్ శివకోటేశ్వర్, పాఠశాల ప్రిన్సిపాల్ సురేఖ, ఐ.పీ.ఎల్ ఇంఛార్జీ ఉదయ్, ఎం.పీ.ఎల్ ఇంచార్జీ ఆనంద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ALSO READ: ‘ఆకలిగా ఉన్నవారి ఆకలి తీర్చుదాం’
‘వ్యవసాయం భారతదేశానికి వెన్నెముక లాంటిది’