బాధిత కుటుంబాలకు ఝాన్సీరెడ్డి పరామర్శ
స్టార్ త్రినేత్రం, పాలకుర్తి: పెద్దవంగర మండలం చిట్యాల గ్రామంలో కోట భిక్షం, ఎదురు సుధాకర్లు ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి, ఆర్ధిక సహాయం అందజేశారు.

అనంతరం పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామంలో యసరపు ఎల్లయ్య, యసరపు లక్ష్మిలు ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి బాధిత కుటుంబసభ్యుల ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆర్ధిక సహాయం అందజేశారు.
అనంతరం పెద్దవంగర మండలకేంద్రంలో ఎడవెల్లి సోమలక్ష్మి, ఉడుగుల సోమయ్యలు ఇటీవల మృతిచెందారు. దీంతో విషయం తెలుసుకున్న పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి శుక్రవారం బాధిత కుటుంబసభ్యుల ఇంటికి వెళ్లి, వారిని పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి, బ్లాక్ ప్రెసిడెంట్ హామ్యా నాయక్, మండల ప్రెసిడెంట్ ముద్దసాని సురేష్, సీనియర్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు రంగు మురళి, శ్యామ్, గోపాల్, వేణు, సుధాకర్, నరేందర్ రెడ్డి, శ్రీను, వివిధ గ్రామాల అధ్యక్షులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: చిన్నారిని ఆశీర్వదించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి
బాధిత కుటుంబాలకు ఝాన్సీరెడ్డి పరామర్శ