HomeSpecial FocusMunicipal Elections: బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం

Municipal Elections: బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం

📰 Generate e-Paper Clip

ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్

కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి

బీఆర్ఎస్ విజయం పట్ల నేతల ధీమా

9వ వార్డు అభ్యర్థిగా సింగరబోయిన రమా- రాజశేఖర్

10వ వార్డు అభ్యర్థిగా తుమ్మల అరుణ- శ్రీధర్

11వ వార్డు అభ్యర్థిగా సిలువేరు కుమారస్వామి

స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బుధవారం విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారం కొనసాగింది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 9వ వార్డు నుంచి సింగరబోయిన రమా- రాజశేఖర్, 10వ వార్డు నుంచి తుమ్మల అరుణ- శ్రీధర్, 11వ వార్డు నుంచి సిలువేరు కుమారస్వామి అభ్యర్థులుగా బరిలో ఉన్న నేపథ్యంలో, వారికి అత్యధిక మెజార్టీతో విజయాన్ని అందించాలని కోరుతూ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు.

ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలతో నేరుగా మమేకమై, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై అరూరి రమేష్ వివరించారు. వర్ధన్నపేట పట్టణ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషిని గుర్తు చేస్తూ, రానున్న రోజుల్లో మున్సిపాలిటీలో మరింత వేగంగా అభివృద్ధి సాధించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

ప్రచారంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పట్టణానికి మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిందని పేర్కొన్నారు. మున్సిపల్ పాలనలో అనుభవం ఉన్న నాయకత్వమే పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలదని, అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఆయనతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

ALSO READ: Romantic movies: సాదాసీదా లవ్ స్టోరీలు చూసి బోర్ కొట్టిందా?. . ఓటీటీలో అస్సలు మిస్సవ్వకూడని 10 బోల్డ్ సినిమాలు చూసేయండి.

RELATED ARTICLES

Most Popular