Never Too Late: ఆలస్యం కావచ్చు కానీ గురి తప్పదు.. 56 ఏళ్ల వయసులో టెన్త్ పాసైన దినసరి కూలీ
56 ఏళ్ల వయసులో, గంగా ఒరాన్ తన వయసులో చాలామంది చేయని పనిని చేసినందుకు వార్తల్లో నిలిచాడు. ఆలస్యమైనా కానీ సాధించాలనుకున్న తన కలను నెరవేర్చుకుని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Never Too Late: 56 ఏళ్ల వయసులో, గంగా ఒరాన్ తన వయసులో చాలామంది చేయని పనిని చేసినందుకు వార్తల్లో నిలిచాడు. ఆలస్యమైనా కానీ సాధించాలనుకున్న తన కలను నెరవేర్చుకుని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. జార్ఖండ్ ఖుంటిలోని జిల్లా విద్యా సూపరింటెండెంట్ (DSE) కార్యాలయంలో రోజువారీ కూలీ ఉద్యోగిగా పనిచేస్తున్న గంగా ఇటీవల తన మెట్రిక్యులేషన్ పరీక్షను 47.2% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఏళ్ల క్రితమే 9వ తరగతిలో చదువు మానేసిన వ్యక్తి ఇప్పుడు టెన్త్ పాస్ కావడం అక్కడి ప్రజలను విస్మయానికి గురి చేసింది.
ఖుంటి సదర్ బ్లాక్ పరిధిలోని కలమటి గ్రామంలో నివసించే ఓరాన్, ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవడానికి విద్యను పూర్తి చేయాలని ఎప్పుడూ కలలు కనేవాడు. కానీ పేదరికం అతని ప్రణాళికలను తలకిందులు చేసింది. బోర్డు పరీక్షకు నమోదు చేసుకోవడానికి అతని కుటుంబం రూ. 40 చెల్లించలేకపోవడంతో అతను 9వ తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది.
అతను రోజువారీ వేతన ప్రాతిపదికన ప్యూన్‌గా పనిచేయడం ప్రారంభించాడు. నెలకు దాదాపు రూ. 9,000 సంపాదిస్తున్నాడు. అయితే, అతని విద్యార్హత కారణంగా అతని ఉద్యోగాన్ని రెగ్యులర్ చేసుకోలేకపోయాడు. తన పనిని మార్చుకోవాలని నిశ్చయించుకుని, గంగా చలాగిలోని బిర్సా హైస్కూల్‌లో చేరాడు. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. బేసిక్ ప్రిపరేషన్ తోనే అతను విజయం సాధించాడు. మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ తర్వాత, అతను ఉద్యోగంలో రెగ్యులరైజ్ చేయబడతాడని ఆశిస్తున్నాడు.
ఈ సంఘటనతో అతని కుటుంబం ముఖంలో ఆనందం మరింత బలంగా ప్రతిబింబించింది. 80 ఏళ్ల వయసులో నడవలేని, మాట్లాడలేని అతని వృద్ధ తల్లి హిరమణి దేవి, అతని భార్య చారి ఒరాన్ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “ఆమె మాటల్లో వ్యక్తపరచలేకపోయినా, ఆమె కళ్ళను చూస్తే ఆమె ఎంత గర్వంగా ఉందో అర్థమవుతుంది” అని గంగా అన్నారు. అతని కుమార్తెలు అందరూ వివాహితులు. వారి కూడా తండ్రి విజయం పట్ల ఉత్సాహంగా ఉన్నారు.
“నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. కానీ అంతకంటే ఎక్కువగా 56 సంవత్సరాల వయసులో ఈ ఘనత సాధించడం నా కుటుంబాన్ని సంతృప్తిపరిచింది” అని ఆయన భావోద్వేగంతో అన్నారు. “వాస్తవానికి నా సామర్థ్యాన్ని నిరూపించుకోవడం. కెరీర్ నిచ్చెనపైకి వెళ్లడం అదే సమయంలో నా కుటుంబం గర్వపడేలా చేయడమే నా ఉద్దేశ్యం” అని గంగ చెప్పారు. మరోపక్క ఖుంటి జిల్లా విద్యాశాఖ అధికారిణి అపూర్వ పాల్ చౌదరి గనగ ఒరాన్‌ను అభినందించారు. ఈ ప్రాంతం పాఠశాల డ్రాపౌట్ సిండ్రోమ్ గుప్పిట్లో ఉన్నందున అతన్ని ప్రేరణగా అభివర్ణించారు. “గంగ విద్యకు వయస్సు అవసరం లేదని నిరూపించింది. అతని సాధనకు, డిపార్ట్‌మెంట్ అతన్ని సత్కరిస్తుంది. అతను కోరుకుంటే తదుపరి విద్యలో అతనికి సహకారం ఇస్తుంది” అని ఆమె తెలిపారు.
Also Read: Mother Love: తల్లి ప్రేమను చాటుకున్న వృద్ధురాలు.. కూతురికి 85ఏళ్ల మహిళ కిడ్నీ దానం
Never Too Late: ఆలస్యం కావచ్చు కానీ గురి తప్పదు.. 56 ఏళ్ల వయసులో టెన్త్ పాసైన దినసరి కూలీ