3 tomatoes saved the family: భవనం శిథిలాల కింద చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడిన 3 టమాటాలు – అదెలా అంటే
3 tomatoes saved the family: కొన్ని రోజుల కిందట భవనం కూలిన ఘటనలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. 3 టమాటాలు ఓ కుటుంబం ప్రాణాలు నిలబెట్టాయి. జనవరి 24న ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో కుప్పకూలిన బహుళ అంతస్థుల భవనం శిథిలాల నుంచి నలుగురు సభ్యుల కూడిన కుటుంబాన్ని సజీవంగా బయటకు తీశారు.
3 tomatoes saved the family: కొన్ని రోజుల కిందట భవనం కూలిన ఘటనలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. 3 టమాటాలు ఓ కుటుంబం ప్రాణాలు నిలబెట్టాయి. జనవరి 24న ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో కుప్పకూలిన బహుళ అంతస్థుల భవనం శిథిలాల నుంచి నలుగురు సభ్యుల కూడిన కుటుంబాన్ని సజీవంగా బయటకు తీశారు. అయితే ఆ కుటుంబం దాదాపు 30 గంటల పాటు శిథిలాల కింద ఉన్నప్పటికీ ఎలా బతికి ఉన్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే వారంతా కేవలం మూడు టమటాలతో తమ ప్రాణాలను కాపాడుకోవడం ఈ ఘటనలో హైలెట్ గా చెప్పవచ్చు.
జనవరి 29 (బుధవారం) అర్థరాత్రి జరిపిన ఆపరేషన్‌లో రాజేష్ (30), అతని భార్య గంగోత్రి (26), వారి కుమారులు ప్రిన్స్ (6), రితిక్ (3) సహా కుటుంబాన్ని రక్షించినట్లు అధికారులు తెలిపారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న తర్వాత తనకు ఎదురైన కష్టాలను వివరించిన రాజేష్.. తన ఇంట్లో ఉన్న మూడు టమాటాలు తిని తనతో పాటు తన కుటుంబం ఆకలి నుంచి బయటపడిందని చెప్పాడు. “నేను మా కుటుంబానికి రాత్రి భోజనం సిద్ధం చేయడానికి ముందు సాయంత్రం 6.30 గంటలకు భవనం కూలిపోయింది. మా పైన ఉన్న చెత్తను తొలగించడానికి మేము చాలా ప్రయత్నించాం. కానీ అది కుదరలేదు. ఇక నేను ఆ దేవుడిపైనే భారం వేశాను. అలా 30 గంటలకు పైగా ఇంట్లో మేం కేవలం మూడు టమటాలు తిని ఆకలి తీర్చుకున్నాం” అని చెప్పారు. “మమ్మల్ని బయటకు తీసినప్పుడు మేం అపస్మారక స్థితిలో ఉన్నాం. మేమంతా ఎప్పుడు, ఎలా ఆసుపత్రికి చేరుకున్నామో కూడా నాకు గుర్తు లేదు” అన్నారాయన.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కొత్తగా నిర్మించిన భవనం సీలింగ్ స్లాబ్ వంట గ్యాస్ సిలిండర్‌పై పడటంతో ఆ కుటుంబం చిక్కుకుపోయింది. ఇదే రాజేష్, అతని కుటుంబాన్ని శిథిలాల కింద నలిగిపోకుండా నిరోధించింది. ఇకపోతే ఢిల్లీ పోలీసులు బిల్డింగ్ యజమాని యోగేంద్ర భాటిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని వివిధ సెక్షన్ల కింద నేరపూరిత నరహత్యతో సహా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.