UNO: భారత్కు ఐరాసలో శాశ్వత సభ్యత్వం.. డెన్మార్క్ మరోసారి మద్దతు!
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనకు డెన్మార్క్ మరోసారి తన మద్దతును ప్రకటించింది. సంస్కరించిన ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలని స్పష్టం చేసింది. అలాగే భారత్-యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) త్వరగా కుదరాలని ఆకాంక్షించింది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఐదో భారత్-డెన్మార్క్ సంయుక్త కమిషన్ సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్ముస్సెన్ ఈ...