Telugu States: తెలుగు రాష్ట్రాల్లో పోస్టర్ల కలకలం.. సైలెంట్ పొలిటికల్ పార్టీ పేరుతో హల్‌చల్!

తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా వెలసిన కొన్ని పోస్టర్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌, గుంటూరు, విజయవాడ నగరాల్లో 'సైలెంట్ పొలిటికల్ పార్టీ' పేరుతో కనిపిస్తున్న ఈ పోస్టర్లు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పోస్టర్లపై ఉన్న సందేశాలు, వినూత్నమైన బొమ్మలు, క్యూఆర్ కోడ్‌లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ పోస్టర్లపై పాలకుడి ముఖం మారితే.. అధికారుల స్వభావం మారుతుందా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ అధికారుల పనితీరు, వ్యవస్థలోని విధానాలు మారుతున్నాయా? అనే అంశాన్ని ఈ సందేశం ద్వారా లేవనెత్తినట్లు కనిపిస్తోంది....