Mammootty: ఏఐ వీడియోల ఎఫెక్ట్.. డ్యాన్స్ చేయాలన్న చిరకాల కోరికకు మమ్ముట్టి గుడ్‌బై!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనకు ఉన్న ఓ చిరకాల కోరికను వదులుకున్నట్లు సరదాగా వెల్లడించారు. సినిమాల్లో కనీసం ఒక్కసారైనా డ్యాన్స్ చేయాలన్న ఆశ తనకు ఉండేదని, అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డ్యాన్స్ వీడియోల కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్నానని చెప్పారు. ఒకవేళ తాను నిజంగా సినిమాలో డ్యాన్స్ చేసినా.. ప్రేక్షకులు దానిని ఏఐ వీడియో అని అనుకుంటారేమోనని చమత్కరించారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమ్ముట్టి.. సినీ పరిశ్రమపై ఏఐ ప్రభావం గురించి ఆసక్తికరంగా...