KTR: తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం..డీలిమిటేషన్‌కు కేటీఆర్ మద్దతు
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను పూర్తిగా కాపాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ స్థానాల పునర్విభజనలో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించబోమని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్యాన్ని యథాతథంగా కొనసాగించాలని బీఆర్ఎస్ మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని తెలిపారు. లోక్‌సభ స్థానాల...