Medical Tourism: ప్రపంచానికే కీలక కేంద్రంగా భారత్‌.. విదేశీ రోగులు వస్తున్న 6 నగరాలు ఇవే!

వైద్య చికిత్సల కోసం విదేశాలకు వెళ్లే రోగులకు భారత్‌ గమ్యస్థానంగా మారుతోంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం, అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండటంతో అంతర్జాతీయ రోగులు భారత్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గుండె శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, క్యాన్సర్‌ చికిత్స, సంతాన సాఫల్య చికిత్సలు, ఎముకలకు సంబంధించిన వైద్య సేవల కోసం విదేశీయులు భారత్‌కు వస్తున్నారు. 2023 నుంచి 2025 మధ్య కాలంలో 18 లక్షల మందికి పైగా విదేశీయులు వైద్య చికిత్సల కోసం భారత్‌ను సందర్శించినట్లు గణాంకాలు...