యాప్‌ల డేటా వేట..మన ప్రైవసీకి ముప్పేనా?

నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. బ్యాంకింగ్, షాపింగ్, జ్యోతిష్యం, నిత్యావసరాల ఆర్డర్ల వరకు ప్రతిదానికీ మనం మొబైల్ యాప్‌లపై ఆధారపడుతున్నాం అయితే మనం ఫోన్‌ను వాడుతున్నామా లేక ఫోన్ యాప్‌లే మన డేటాను వాడుకుంటున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన పరిణామాలు యూజర్ల వ్యక్తిగత గోప్యతపై ఆందోళన కలిగిస్తున్నాయి. రివర్స్ ఇంజనీరింగ్ విశ్లేషణలో ఆస్ట్రోటాక్ యాప్‌లో 244 యాప్‌ల జాబితా బయటపడటం అలాగే బ్లింకిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై కూడా ఇలాంటి ఆరోపణలు...