Mission 2028: కోటి ఓట్లు- 90 సీట్లే టార్గెట్… 2.0 లక్ష్యంగా రేవంత్ మాస్టర్ ప్లాన్‌!

మిషన్ 2028..ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడే యుద్ధభూమిని సిద్ధం చేస్తోంది. పీఏసీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి...కోటి ఓట్లు — 90 అసెంబ్లీ సీట్లు అనే భారీ లక్ష్యాన్ని ప్రకటించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు అలాగే అంతర్గత అసంతృప్తులను కట్టడి చేసేందుకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకువస్తున్నారు. ఎన్నికల వ్యూహాలను రూపొందించడానికి, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కీలక...