Congress: మూడేళ్ల ‘ప్రజా పాలన’..సంక్షేమ పరుగులా.. గ్యారెంటీల సవాళ్లా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు (2023 డిసెంబర్ – 2026 డిసెంబర్) పూర్తవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'ప్రజా పాలన'పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సంక్షేమ పథకాలు, రుణమాఫీ, ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం తమ విజయాలుగా చెప్పుకుంటుండగా మరోవైపు పూర్తిస్థాయిలో అమలు కాని 6 గ్యారెంటీలు, పెండింగ్ బిల్లులు, పరిపాలనాపరమైన లోపాలపై ప్రతిపక్షాలు, విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్ పాలనలో పాజిటివ్ అంశాలను పరిశీలిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి),...