WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై ముందుగానే మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇకపై మనకు నచ్చిన తేదీ, సమయానికి మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా వెళ్లేలా ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. కేవలం టెక్ట్స్‌ మెసేజ్‌లే కాకుండా ఫొటోలు, వీడియోలు, లింకులను కూడా షెడ్యూల్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ విషయాన్ని కునాల్ షా తన బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. వినియోగదారులు చాలా కాలంగా కోరుకుంటున్న ఫీచర్లలో...